ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి బెదిరింపు లేఖ..
నెల్లూరు జిల్లాలో వరుస బెదిరింపుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు మహిళా ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ రావడం జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేకి ఈ రకంగా చంపేస్తామంటూ లెటర్ వస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.
బెదిరింపు లేఖ..
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి బెదిరింపు లేఖ వచ్చింది. ఆగస్టు 17న ఒక వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నివాసానికి వచ్చాడు. అక్కడ భద్రతా సిబ్బందికి ఒక లేఖ అందజేసి వెళ్లిపోయాడు. ఆ లేఖను తెరిచి చూడగా.. అందులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తనకు రూ.2 కోట్లు ఇవ్వాలని, ఇవ్వకపోతే చంపేస్తామని హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఎంపీ, ఎమ్మెల్యేలకు సమాచారం అందించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల దర్యాప్తు..
సమాచారం అందుకున్న పోలీసులు ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే అల్లూరు మండలం ఇస్కపాళెంకు చెందిన ఒక వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అదేవిధంగా వేమిరెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుడిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతడి దగ్గర నాలుగు మొబైల్స్ ఉండటంతో పోలీసులు అనుమానాలు పెంచుకుని విచారణ కొనసాగిస్తున్నారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ.. బెదిరింపు లేఖ వచ్చిన విషయం నిజమేనని ధృవీకరించారు. ఈ కేసుపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.
కావలి ఎమ్మెల్యే ఆరోపణలు..
మరోవైపు రెండు రోజుల క్రితం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కుట్ర జరుగుతోందని, తన క్వారీ సమీపంలో డ్రోన్ ఎగరవేసి రెక్కీ చేసినట్లు ఆరోపించారు. తాను చివరి నిమిషంలో తన కార్యక్రమాలను మార్చుకుని అమరావతికి వెళ్లినందువల్ల ప్రమాదం తప్పిందని చెప్పారు. ఇద్దరు యువకులను తన అనుచరులు పట్టుకొని పోలీసులకు అప్పగించారని తెలిపారు. ఈ కుట్ర వెనుక మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తూ, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని కూడా పేర్కొన్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications