బొబ్బలొచ్చాయి: రైస్ కుక్కర్ పేలి చిన్నారులకు తీవ్ర గాయాలు
విశాఖపట్నం: నగరంలోని అంగన్ వాడీ కేంద్రంలో రైస్ కుక్కర్ పేలి ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహారాణి పేట రజకవీధిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... 21వ వార్డు మహారాణి పేట రజకవీధిలో ఉన్న రజక సేవా సంఘం కార్యాలయంలో అంగన్ వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు.
ఆ గదిలోనే 20 మంది పిల్లలకు అంగన్ వాడీ టీచర్ సరోజినీ పాఠాలు చెబుతోంది. బుధవారం ఆయన సెలవులో ఉంది. పాఠాలు చెప్పిన అనంతరం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో పిల్లల కోసం కుక్కర్‌లో అన్నం వండుతున్నారు. గ్యాస్ పొయ్యిపై కుక్కర్ పెట్టిన కాసేపటికే కుక్కర్ మూత ఒక్కసారిగా పైకి ఎగిరింది.
దీంతో కుక్కర్‌లో ఉడుకుతున్న అన్నం, గంజి పక్కనే ఉన్న పిల్లలపై పడింది. దీంతో స్పింగ్ రోడ్డు ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల మురళీకృష్ణ, సాలిపేటలో ఉంటున్న మూడున్నరేళ్ల ముత్తా దుర్గా దీపక్, మూడున్నరేళ్ల మహ్మద్ అయూం తీవ్రంగా గాయపడ్డారు.
వీరికి రెండు కాళ్లు, చేతులు కాలి బొబ్బలెక్కాయి. గాయపడిన చిన్నారులను వెంటనే కేజీహెచ్‌లో చేర్పించారు. ప్రస్తుతం వారి చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న సీపీడీఓ ఉషారాణి, ఐసీడీఎస్ సూపర్ వైజర్ కుమారి, అంగన్ వాడీ టీచర్లు చిన్నారులను పరామర్శించారు.

రైస్ కుక్కర్ పేలి చిన్నారులకు తీవ్ర గాయాలు
నగరంలోని అంగన్ వాడీ కేంద్రంలో రైస్ కుక్కర్ పేలి ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహారాణి పేట రజకవీధిలో బుధవారం చోటు చేసుకుంది.

రైస్ కుక్కర్ పేలి చిన్నారులకు తీవ్ర గాయాలు
వివరాల్లోకి వెళితే... 21వ వార్డు మహారాణి పేట రజకవీధిలో ఉన్న రజక సేవా సంఘం కార్యాలయంలో అంగన్ వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు.

రైస్ కుక్కర్ పేలి చిన్నారులకు తీవ్ర గాయాలు
ఆ గదిలోనే 20 మంది పిల్లలకు అంగన్ వాడీ టీచర్ సరోజినీ పాఠాలు చెబుతోంది. బుధవారం ఆయన సెలవులో ఉంది. పాఠాలు చెప్పిన అనంతరం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో పిల్లల కోసం కుక్కర్‌లో అన్నం వండుతున్నారు. గ్యాస్ పొయ్యిపై కుక్కర్ పెట్టిన కాసేపటికే కుక్కర్ మూత ఒక్కసారిగా పైకి ఎగిరింది.

రైస్ కుక్కర్ పేలి చిన్నారులకు తీవ్ర గాయాలు
దీంతో కుక్కర్‌లో ఉడుకుతున్న అన్నం, గంజి పక్కనే ఉన్న పిల్లలపై పడింది. దీంతో స్పింగ్ రోడ్డు ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల మురళీకృష్ణ, సాలిపేటలో ఉంటున్న మూడున్నరేళ్ల ముత్తా దుర్గా దీపక్, మూడున్నరేళ్ల మహ్మద్ అయూం తీవ్రంగా గాయపడ్డారు.

రైస్ కుక్కర్ పేలి చిన్నారులకు తీవ్ర గాయాలు
వీరికి రెండు కాళ్లు, చేతులు కాలి బొబ్బలెక్కాయి. గాయపడిన చిన్నారులను వెంటనే కేజీహెచ్‌లో చేర్పించారు. ప్రస్తుతం వారి చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న సీపీడీఓ ఉషారాణి, ఐసీడీఎస్ సూపర్ వైజర్ కుమారి, అంగన్ వాడీ టీచర్లు చిన్నారులను పరామర్శించారు.

Click it and Unblock the Notifications