హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ముగ్గురు మృతి
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఔటర్ రింగురోడ్డుపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ వద్ద ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్, వృద్ధ దంపతులు మృతి చెందారు.
గుంటూరు జిల్లాకు చెందిన మల్లికార్జున, భావనలు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కొద్దిసేపటి క్రితమే తమ కారులో తమ ఊరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

వ్యాపారి ఇంట్లో భారీ చోరీ
వరంగల్ జిల్లాలోని నవయువకాలనీలో రమణారావు అనే వ్యాపారి ఇంట్లో భారీ చోరి జరిగింది. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు 60 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బుధవారం సాయంత్రం రమణారావు కుటుంబంతో సహా బయటకు వెళ్లిన సమయంలో దుండగులు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇద్దరు వ్యక్తులు దోపిడీకి యత్నించారు. ఆటోలో మిర్చి బస్తాలను తరలిస్తున్న ఇద్దరిని సెక్యూరిటీ గార్డు పట్టుకుని మిర్చియార్డు కార్యాలయంలో పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications