విజయవాడలో కలకలం: ముగ్గురు రైతుల ఆత్మహత్యాయత్నం..
దాదాపు 30మంది రైతులను అరెస్ట్ చేసి నున్న పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
విజయవాడ: విజయవాడలో ముగ్గురు రైతుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. పురుగుల ముందు తాగి ముగ్గురు రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నున్న పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
రైతుల సమస్యలు పరిష్కరించాలని రైతులంతా బుధవారం 'ఛలో అసెంబ్లీ' నిరసనకు బయలుదేరారు. పోలీసులు అడ్డుకోవడంతో ఛలో అసెంబ్లీ నిరసన భగ్నమైంది. దాదాపు 30మంది రైతులను అరెస్ట్ చేసి నున్న పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీస్ స్టేషన్ లోనే ముగ్గురు రైతులు ఆత్మహత్యకు యత్నించారు. దీంతో హుటాహుటిని వారిని ఆసుపత్రికి తరలించారు. కల్తీ విత్తనాల వల్ల నష్టపోయి అప్పుల పాలైనందువల్లే ఈ ముగ్గురు రైతులు ఆత్మహత్యకు యత్నించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యల పట్ల చొరవ చూపాలని రైతులు వేడుకుంటున్నారు.












Click it and Unblock the Notifications