3 ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ నౌకల జలప్రవేశం (పిక్చర్స్)
విశాఖపట్నం: సముద్ర తీర తూర్పు ప్రాంత పరిరక్షణకు మూడు సహాయక నౌక (ఎఎస్‌వి)లను బుధవారం తూర్పు నావికా దళం చీఫ్ రియర్ అడ్మిరల్ అనిల్ చోప్రా విశాఖ నావల్ డాక్ యార్డ్‌లో ప్రారంభించారు.
ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ తరగతికి చెందిన ఈ ఎఎస్‌వి నౌకలను భారత నావికా దళం, ఓఎన్‌జిసిల సంయుక్త సహకారంతో అబుదబి షిప్ బిల్డర్స్, రాడ్‌మన్ 78 (స్పెయిన్) సంస్థలు నిర్మించాయి.
ఈ తరహా నౌకల్లో తౌమ్మిది తూర్పు నావికా దళంలో భాగమయ్యాయని నావల్ ఆఫీసర్ ఇంచార్జీ కెప్టెన్ సతీష్ ఉన్యాల్ అన్నారు. ఆ తర్వాత టాంగో సహాయక నౌకల కమాండింగ్ అధికారులకు కమిషనింగ్ వారంట్లను అందజేశారు.

ఎఎస్‌విల ప్రారంభం
సముద్ర తీర తూర్పు ప్రాంత పరిరక్షణకు మూడు సహాయక నౌక (ఎఎస్‌వి)లను బుధవారం తూర్పు నావికా దళం చీఫ్ రియర్ అడ్మిరల్ అనిల్ చోప్రా విశాఖ నావల్ డాక్ యార్డ్‌లో ప్రారంభించారు.

జాతీయ గీతాలపన మధ్య
8వ స్క్వాడ్రన్‌లో భాగమైన ఈ సహాయక నౌకలపై (టాంగో - 35,36,37) చిహ్నాలను జాతీయ గీతాలపన మధ్య ఆవిష్కరించారు.

భారత్ ఎదిగింది
సాయుధులైన గార్డుల కవాతును పర్యవేక్షించిన రియర్ అడ్మిరల్ అనిల్ చోప్రా ఈ సందర్భంగా ప్రసంగించారు. అణు జలాంతర్గామినే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సమకూర్చుకునే స్థాయికి భారత్ ఎదిగిందని చెప్పారు.

ప్రధానమైంది..
సముద్ర సంబంధ రక్షణ, కోస్తా తీర ప్రాంత పరిరక్షణలో భారత నావికా దళంలో ఈ తరహా నౌకల పాత్ర ప్రధానమైందని అనిల్ చోప్రా అన్నారు.

దూసుకుపోతాయి
కోస్తా తీరంలో నితంతర గస్తీకి అనువుగా పూర్తి స్థాయిలో వేగంగా దూసుకుపోయే ఈ నౌకలు ఆధునిక సాంకేతికతను కలిగి ఉన్నట్లు అనిల్ చోప్రా తెలిపారు.

నౌకల్లో వసతులు
ఈ నౌకల్లో నావిగేషన్ రాడర్లు, శాటిలైట్ ఆధారిత దిక్సూచి, జిపిఎస్ తదితర వసతులున్నాయి.

ఇలా పనిచేస్తాయి..
1,600 అశ్వవేగంతో రెండు ఇంజన్లు కలిగి 40 నాటికల్ మైళ్ల మేర డేగ చూపు సామర్థ్యం కలిగి, ఆరుగురు నావికులతో పాటు కమాండింగ్ అధికారి ఆదేశాలతో గస్తీ కాస్తాయి.












Click it and Unblock the Notifications