నగల షాపులో 3గురు అనుమానాస్పద మృతి
కడప: కడప జిల్లాలోని ఓ నగల దుకాణంలో ముగ్గురు సిబ్బంది అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని తళ్లెం నగల దుకాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
గురువారం ఉదయం దుకాణం తెరిచిన సిబ్బందికి ముగ్గురు మరణించి ఉండడాన్ని గమనించారు. వారు పొగ వల్ల ఊపిరి ఆడక చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే, ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంఘటనపై యాజమాన్యం కూడా పెదవి విప్పడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి ప్రయత్నం జరిగిందా, లేదా మరేమైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications