ప్రేమికులను కలిపారు ,ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు

ఏలూరు : స్నేహితుడి ప్రేమను విజయవంతం చేయాలనుకొన్నారు. ప్రేమికురాలిని, ప్రియుడిని కలిపారు. కథ సుఖాంతం అయ్యిందని భావించిన వారికి పోలీసులు ప్రేమ జంట గురించి ఆరా తీయడంతో భయపడి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.

పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామానికి చెందిన కొసం కిషోర్ , మద్దుల ఏసు, చిగుపల్లి ఏసు, పెయ్యల నవీన్,దొడ్డిగర్ల వెంకటరత్నంలు స్నేహితులు. వెంకటరత్నం అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు.అయితే ఆ యువతి తల్లిదండ్రులు ఆమెను వేరే యువకుడికి ఇచ్చి వివాహం చేశారు.

ఈ వివాహం ఇష్టం లేని ఆ యువతి వెంకటరత్నం వద్దకు వచ్చింది. ప్రేమికులను కలపాలనే ఉద్దేశ్యంతో వెంకటరత్నం స్నేహితులు కిషోర్ , మద్దుల ఏసు, చిగురు పల్లి ఏస్, ఏలూరు రైల్వేస్టేషన్ లో వారిని హైద్రాబాద్ కు వెళ్ళే రైలును ఎక్కించారు. ప్రేమికులను కలిపామని స్నేహితులంతా సంతోషపడ్డారు.

Three friends sucide attempt fear of police

యువతి బందువులకు పేమికులు పారిపోయిన విషయం తెలిసింది.ప్రేమికులు పారిపోయినందుకు సహాకరించిన స్నేహితులను పోలీసులు పిలిచి విచారించారు.ప్రేమ జంట ఆచూకీ చెప్పాలని కోరారు.ప్రేమ జంట ఆచూకీ తెలియకపోవడంతో భయం పట్టుకొంది స్నేహితులకు .పోలీసుల నుండి ఎప్పుడు సమాచారం వస్తోందో ఏం అడుగుతారో..ప్రేమ జంట ఆచూకీ తెలియక తవ్రంగా భయపడ్డారు.

పోలీసుల కు ఏం చెప్పాలో తెలియక మద్దుల ఏసు, చిగురుపల్లి ఏసు లు గురువారం నాడు తడికలపూడిలో పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని స్నేహితుడైన నవీన్ కు పోన్ లో చెప్పారు. అతను వెంటనే ముగ్గురిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. ఏలూరు ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+