అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూడు కారణాలతో వెనక్కి తగ్గిన జగన్-హైకోర్టు అక్షింతలు-అమరావతి పాదయాత్ర-బీజేపీ మద్దతు

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రవచిత మూడు రాజధానుల ప్రక్రియ మొదలై రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అదే సమయంలో ప్రభుత్వంపై ప్రభుత్వం రాజధానులిచ్చిన మూడు ప్రాంతాల ప్రజల నుంచీ ఒత్తిడి పెరుగుతోంది. అలాగే పలు కీరణాలు ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించుకునేలా చేసినట్లు తెలుస్తోంది. దీంతో సాంకేతిక కారణాలతోనే మూడు రాజధానుల బిల్లుల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో రాజధాని బిల్లుల రద్దుకు దారి తీస్తున్న మూడు ప్రధాన కారణాలపై ఓ విశ్లేషణ.

Recommended Video

3 Capitals Bill : మూడు రాజధానుల బిల్లు రద్దు.. కాసేపట్లో సీఎం జగన్ ప్రకటన! || Oneindia Telugu
 మూడు రాజధానులపై జగన్ యూటర్న్

మూడు రాజధానులపై జగన్ యూటర్న్


ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై వైసీపీ సర్కార్ రెండేళ్ల క్రితం నిర్ణయం తీసుకుంది. ఏపీలోని అమరావతిలో ఉన్న ప్రస్తుత రాజధానిని విశాఖ, కర్నూలుకు కూడా విస్తరిస్తూ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చారు. అలాగే అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందంలో భాగమైన సీఆర్డీయే చట్టాన్ని కూడా రద్దు చేస్తూ మరో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించారు. వీటికి సాంకేతిక అంశాలతో సంబంధం లేకుండా గవర్నర్ ఆమోదం కూడా లభించేసింది. అయితే కొన్ని తప్పనిసరి కారణాలతో సీఎం జగన్ వీటిపై యూటర్న్ తీసుకోక తప్పలేదు. వైసీపీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల బిల్లులపై జగన్ యూటర్న్ ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

 మూడు కీలక కారణాలు

మూడు కీలక కారణాలు

మూడు రాజధానుల ఏర్పాటు కోసం తీసుకొచ్చిన రెండు కీలక బిల్లుల్ని వెనక్కి తీసుకోవాలని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజధానులపై ఓవైపు హైకోర్టులో కేసులు నడుస్తుండగా.. వైసీపీ సర్కార్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇందులో మూడు కీలకమైన కారణాలు బయటికి వస్తున్నాయి. ఈ కారణాలతోనే వైసీపీ సర్కార్ మూడు రాజధానులపై వెనక్కి తగ్గిందా అన్న చర్చ సాగుతోంది. ఈ కారణాలు ఒకదానితో ఒకటి సంబంధఁ లేకుండా వేటికవే ప్రత్యేకత కలిగినవి కావడం మరో విశేషం.

 అమరావతి రైతుల పాదయాత్ర

అమరావతి రైతుల పాదయాత్ర

అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ రైతులు రెండేళ్లుగా ఉద్యమం సాగిస్తున్నారు. ఈ ఉద్యమం కేవలం 26 గ్రామాలకే పరిమితం అయిందని, టీడీపీ అండ లేకపోతే ఉద్యమమే లేదని వైసీపీ ప్రచారం చేస్తూ వచ్చింది. దీంతో అమరావతిలోనే రాజధాని ఉండాలన్న డిమాండ్ కు అంతగా మద్దతు లభించకుండా వైసీపీ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రకు తెరదీశారు. న్యాయస్ధానం టూ దేవస్ధానం పేరుతో మహా పాదయాత్రను ప్రారంభించారు. అమరావతి నుంచి మొదలైన పాదయాత్ర తిరుమల వరకూ సాగేలా ప్లాన్ చేశారు. ఈ పాదయాత్ర గుంటూరు జిల్లాలోని అమరావతిలో ఉన్న నేలపాడు గ్రామం నుంచి ప్రారంభమై ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల మీదుగా తిరుమల చేరాల్సి ఉంది. అంటే రాష్ట్రంలో సగం జిల్లాలు ఇందులో కవర్ అయ్యే అవకాశముంది. అలాగే పాదయాత్రకు మార్గమధ్యలో లభిస్తున్న మద్దతుతో ప్రభుత్వం ఆంక్షలు విధించడం, లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్ధితులు నెలకొంటున్నాయి. దీంతో ప్రభుత్వం సహజంగానే ఆత్మరక్షణలో పడింది.

 అమరావతి పాదయాత్రకు బీజేపీ మద్దతు

అమరావతి పాదయాత్రకు బీజేపీ మద్దతు

అమరావతిలో రైతులు, ముఖ్యంగా మహిళలు చేపట్టిన న్యాయస్ధానం టూ దేవస్ధానం పాదయాత్రకు బీజేపీ తొలుత దూరంగా ఉండిపోయింది. దీంతో టీడీపీ, సీపీఐ మాత్రమే ఈ యాత్రకు అండగా నిలిచాయి. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన సందర్భంగా బీజేపీ నేతలతో సమావేశమై అమరావతి పాదయాత్రపై చర్చించారు. పాదయాత్రకు బీజేపీ దూరంగా ఉండిపోవాల్సిన అవసరమేంటన్న చర్చ మొదలైంది. మహిళలు చేస్తున్న పాదయాత్రను ఓన్ చేసుకోవడంలో బీజేపీ విఫలమైందని అమిత్ షా నేతలకు చీవాట్లు పెట్టారు. దీంతో కదిలిన బీజేపీ నేతలు.. అమరావతి పాదయాత్రకు నిన్న నేరుగా సంఘీభావం ప్రకటించారు. దీంతో అమరావతి పాదయాత్రకు కొత్త ఊపొచ్చింది. ప్రభుత్వం మరోసారి ఆత్మరక్షణలో పడింది.

హైకోర్టు రోజువారీ చీవాట్లు

హైకోర్టు రోజువారీ చీవాట్లు


ఏపీ రాజధానుల విషయంలో హైకోర్టులో సాగుతున్న విచారణ వీటన్నింటినీ పతాకస్ధాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా తొలిరోజే రాజధానులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణ నుంచి ఇద్దరు న్యాయమూర్తుల్ని తప్పించాలన్న వైసీపీ సర్కార్ డిమాండ్ కు హైకోర్టు సీజే ప్రశాంత్ మిశ్రా నో చెప్పేశారు. అంతేకాదు రాజధానుల వ్యవహారాన్ని త్వరలో తేల్చేయాలని నిర్ణయించారు. రెండోరోజు అయితే ఏకంగా అమరావతి ఉద్యమాన్ని హైకోర్టు సీజే ప్రశాంత్ మిశ్రా స్వాతంత్ర్య పోరాటంతో పోల్చారు. అమరావతి రైతులకే కాదు రాష్ట్రానికే రాజధాని అని చెప్పేశారు. దీంతో రాజధానుల ఏర్పాటు విషయంలో హైకోర్టు వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వానికి మంటపుట్టించాయి. పరిస్ధితి చూస్తుంటే హైకోర్టు రాజధానులకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేలా ఉందన్న భావన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీంతో రాజధానులపై పరువు పోగొట్టుకోవడం కంటే ఏదో ఒక నిర్ణయం తీసుకుని బయటపడాలని జగన్ భావించినట్లు కనపిస్తోంది.

జగన్ తుది నిర్ణయం అదేనా ?

జగన్ తుది నిర్ణయం అదేనా ?


మూడు రాజధానుల విషయంలో బిల్లుల్ని ఉపసంహరించుకోవాలన్న ఏపీ కేబినెట్ నిర్ణయం ఇప్పుడు ప్రభుత్వం, వైసీపీతో పాటు ఇతర పార్టీలు, ప్రజల్లోనూ కలకలం రేపుతోంది. మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ తీసుకుంటున్న కీలక నిర్ణయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మూడు రాజధానులని చెప్పడం ద్వారా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని భావిస్తున్న సీఎం జగన్.. అలా కాకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి పేరుతో అదే ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తన పని తాను పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నట్లు అర్దమవుతోంది.

English summary
andhrapradesh cabinet's decision on repealment of three capitals bills in assembly causes another uncertainity in capital region and various reasons behind this crucial decison.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X