విషాదం: నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారుల మృతి

గుంటూరు: జిల్లాలోని తుళ్లూరు మండలం దొండపాడు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలు నీట మునిగి దుర్మరణం చెందారు. శనివారం ఉదయం 10గంటల సమయంలో తోటి పిల్లలతో కలిసి ఊరు బయట ఆడుకునే సమయంలో పక్కనే ఉన్న నీటికుంటలో దిగారు.

తొలుత ముగ్గురు పిల్లలు అమల(9),ఉప్పాలపాటి దినేష్(8), సాత్విక్ ( 7) నీటిలో కూరుకుపోయారు. వీరితో ఉన్న మిగతావారు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో వెంటనే విషయాన్ని గ్రామంలో చెప్పడంతో పెద్దలు వచ్చి ముగ్గురి మృతదేహాలను బయటికి తీశారు. రాజధాని రహదారి నిర్మాణం కోసం ఆ గుంత తీసినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు.

Three kids drown in a water pit in Guntur

భార్యను కొట్టి చంపిన భర్త

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఓ వ్యక్తి కొట్టి చంపేశాడు. ఈ దారుణ ఘటన కర్నూలులోని ఎన్టీఆర్‌ బిల్డింగ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెలుగు రఘు, స్వాతి దంపతులు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. కుటుంబ కలహాలతో భర్తమద్యం సేవించి భార్యపై దాడి చేసి కిరాతకంగా కొట్టాడు. తీవ్రగాయాలతో స్వాతి అక్కడిక్కడే మృతి చెందింది.

రఘు మూడు సంవత్సరాల క్రితం స్వాతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. స్వాతికి తల్లిదండ్రులు లేరు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మరిన్ని విషయాలను వెలికి తీసేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+