జగన్ దే బలం, చంద్రబాబు ప్లాన్ ఏంటి- విశాఖలో గెలుపెవరిది..!!

ఏపీలో మరో ఎన్నికకు రంగం సిద్దమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఇప్పుడు స్థానిక సంస్థల కోటా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ మొదలైంది. నేటి నుంచి ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. దీంతో పోటీకి బలమైన అభ్యర్థుల అన్వేషణలో వైసీపీ, టీడీపీ పార్టీలు ఉన్నాయి. స్థానిక సంస్థల్లో వైసీపీదే ఆధిక్యత ఉంది. సమీకరణాలు మారుతున్నాయి. ఈ ఎన్నికలో గెలుపెవరిది.

ఎమ్మెల్సీ ఎన్నిక
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు రంగం సిద్దమైంది. నేటి నుంచి ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. దీంతో పోటీకి బలమైన అభ్యర్థుల అన్వేషణలో వైసీపీ, టీడీపీ పార్టీలు ఉన్నాయి. ఇక, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అలాగే, వైసీపీ నుంచి తెరపైకి మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్‌, బూడి ముత్యాల నాయుడు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, స్థానిక సంస్థల్లో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది.

Three major parties begin Exercise on vizag local body MLC Election Candidates finalised

వైసీపీదే ఆధిక్యత
ఎమ్మెల్సీ ఎన్నికలో జీవీఎంసీ కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. మొత్తం ఓట్లు 841 ఉండగా.. అందులో వైసీపీ బలం 615 ఉంది.. టీడీపీ, జనసేన, బీజెపీ సభ్యులకు కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే 11 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు నేపథ్యంలో వలసలపై కూటమి ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే జీవీఎంసీలో 12 మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించారు.

గెలుపుకు వ్యూహాలు
అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యే కోటా రెండు ఎమ్మెల్సీ స్థానాలను కూటమి గెలుచుకుంది. సభలో సంఖ్యా బలం ఆధారంగా వైసీపీ పోటీకి దూరంగా ఉంది. విశాఖ స్థానిక సంస్థల కోటాలో మాత్రం వైసీపీకి ఆధిక్యత ఎక్కువగా ఉండటంతో..కూటమి ఈ సీటు గెలుచుకునేందుకు వ్యూహాలు సిద్దం చేస్తోంది. స్థానిక సంస్థల్లో ఓటర్లుగా ఉన్న వారిని తమ వైపు తిప్పుకొనేందుకు కూటమి పార్టీల స్థానిక నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. వారు తమతోనే ఉండేలా వైసీపీ ప్రయత్నిస్తోంది. దీంతో..విశాఖ కేంద్రంగా జరిగే ఎన్నిక ఇప్పుడు మూడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+