స్కీమ్‌ల పేరుతో చోరీలు చేసే ముఠా పట్టివేత (పిక్టర్స్)
హైదరాబాద్: మీరు స్కీంలో బంగారు ఆభరణాలను గెల్చుకున్నారని చెప్పి నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠా గుట్టురట్టయ్యింది. వృద్థులున్న చిన్న స్థాయి కిరాణ దుకాణంతో పాటు బడా వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని, అందులోని సిబ్బందిని దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాగుట్టు రట్టయ్యింది.
ఆ రకంగా మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను నగరంలోని సెంట్రల్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 13.25 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించి డిసిపి కమలాసన్ రెడ్డి ఆ ముఠాకు సంబంధించిన వివరాలను అందించారు.
2011లో తాము ఇదే తరహాలో 20సార్లు దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక, ఈ కేసులకు సంబంధించి లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు సుమారు రూ. 13.25 లక్షల విలువ చేసే 46 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

ముఠా గుట్టు రట్టు
హైదరాబాదలోని దిల్‌సుఖ్‌నగర్ చైతన్యపురిలో నివాసముండే సంతోష్ కులకర్ణి(46), గౌలీగూడ సిబిఎస్ బస్ స్టేషన్ సమీపంలో నివాసముండే పులిగిల్ల లక్ష్మణ్(45), దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురికి చెందిన ముదిగొండ భాస్కర్(25)లు ఓ ముఠాగా ఏర్పడి, ఎదుటి వారి దృష్టి మళ్లించి తెలివిగా దొంగతనాలకు పాల్పడుతున్నారు.

ముఠా గుట్టు రట్టు
వీరు వృద్థులు ఉండే వివిధ రకాల వ్యాపార సంస్థలను టార్గెట్ చేసుకుని తొలుత వారిని కలుస్తారు. మీకు ఓ స్కీంలో బంగారు నెక్లెస్, గొలుసు వచ్చిందని నమ్మిస్తారు. అంతగా నమ్మకం కలగకపోతే తమ కంపెనీ మేనేజర్‌తో మాట్లాడాలని నిందితులు వారిలో ఒకరికి ఫోన్ చేసి మాట్లాడిస్తారు. ఆ రకంగా నమ్మిస్తారు.

ముఠా గుట్టు రట్టు
నమ్మకం కల్గిన వృద్దులు వారిని గుడ్డిగా నమ్మి అందుకు తామేమైనా చెల్లించాలా? అని ప్రశ్నించగా, తాము ఇవ్వాలనుకున్న బంగారు ఆభరణానికి కొలతల కోసం తాము ధరించిన ఆభరణాలిస్తే రెండు నుంచి మూడు రోజుల్లో తిరిగి రెండు ఆభరణాలను తిరిగి ఇచ్చేస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ముఠా గుట్టు రట్టు
కొన్ని సందర్భాల్లో షాపులో ఉన్న వారు మరీ అమాయకుల్లా కన్పిస్తే వారు తమ మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండగానే, అదే అదునుగా దుకాణాన్ని సర్దేసి, విలువైన సామానులను తస్కరిస్తుంటారు. ఈ రకంగా వీరు శివార్లలోని పలు దుకాణాలను ఎంపిక చేసుకుని దొంగతనాలకు పాల్పడినా, వీరిని సెంట్రల్ జోన్ పరిధిలోని గాంధీనగర్ పోలీసులు పట్టుకోగలిగారు.












Click it and Unblock the Notifications