బీజేపీ తాజా నిర్ణయం వెనుక - మారుతున్న సమీకరణాలు..!!
ఏపీలో పట్టు పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. పక్కా వ్యూహంతో వ్యవహరిస్తోంది. తాజాగా రాజ్యసభ సభ్యుల ఎంపికలోనూ బీసీ సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చింది. అటు టీడీపీ - జనసేనతో పొత్తుతో ఆ రెండు పార్టీలకు ప్రధానంగా మద్దతుగా రెండు వర్గాలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలతో బీజేపీ జత కట్టింది. బీజేపీ ఏపీ చీఫ్ ఎంపిక ప కసరత్తు జరుగుతోంది. ఇప్పుడు రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక వేళ కొత్త లెక్కలు మొదలయ్యాయి. ముగ్గురు అభ్యర్ధులు ఈ రోజు నామినేషన్లు దాఖలు చేసారు.
ఏపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్లు ప్రకియ పూర్తి అయింది. బీజేపీ రాజ్యసభ అభ్యర్థి కృష్ణయ్య బీజేపీ పిలిచి తనకు రాజ్యసభ ఇచ్చిందని తెలిపారు. బీసీల కోసమే పోరాటం చేశానని.. చేస్తానని వెల్లడించారు. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తానని చెప్పా రు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. 50 ఏళ్లు బీసీల కోసం పోరాటం చేశానని చెప్పారు. బీజేపీ తనకు కొత్త కాదన్నారు.

తాను కండువా కప్పుకున్న మొదటి పార్టీ బీజేపీ అని గుర్తు చేసారు. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేసిన బీదా మస్తాన రావు తిరిగి టీడీపీ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసారు. అనివార్య కారణాల వల్ల రెండున్నరేళ్లు తెలుగుదేశానికి దూరమ య్యానని అన్నారు. సొంతిల్లు లాంటి తెలుగుదేశంలో కొంతకాలం లేకపోవడం ఎంతో బాధించింద ని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు కీలక పదవులు ఆపార్టీలో దక్కుతు న్నాయని చెప్పుకొచ్చారు.
రాష్ట్రాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. ఇక, మరో అభ్యర్ధి సానా సతీశ్ చిన్న వయస్సులోనే నాకు కీలక పదవి ఇచ్చి ప్రోత్సహించి నందుకు సీఎం చంద్రబాబు, లోకేష్‌లకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చిన అవకాశాన్ని బాధ్యతతో నిర్వర్తిస్తానని సానా సతీష్ చెప్పారు. సానా సతీశ్ పైన చివరి నిమిషంలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నుంచి సంఖ్యా బలం లేకపోవటంతో ఈ ముగ్గురూ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వటం లాంఛనంగా మారింది.












Click it and Unblock the Notifications