వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపిలో ముగ్గురు సైకోలు: రోజా, బాబుతో లోకేష్ పోటీ: సింగపూర్‌కు జగన్ లేఖపై చెవిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు నేతలు సైకోలుగా వ్యవహరిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా గురువారం మండిపడ్డారు.

టిడిపి ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడులు సైకోలుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో చంద్రన్న పాలన అరాచకపాలన అన్నారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అభిమాని సూరయ్యను చంపిన పయ్యావుల సోదరులు... వారి భూములను లాక్కోవడం దారుణమన్నారు. సూరయ్య కుటుంబాన్ని చూసి ఎందుకు వణికిపోతున్నారని ప్రశ్నించారు. ధర్నా చేసే నైతిక హక్కు తమకు ఉందన్నారు.

Three psychos in Telugudesam Party: Roja

చంద్రబాబుతో లోకేష్ పోటీ పడుతున్నారు: చెవిరెడ్డి

అమరావతి నిర్మాణంలో సహకరించవద్దని తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సింగపూర్‌కు లేఖలు రాస్తున్నారని టిడిపి యువనేత నారా లోకేష్ అసత్యాలు చెబుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేరుగా అన్నారు.

నారా లోకేష్ కూడా చంద్రబాబు బాటలోనే నడుస్తున్నారన్నారు. అబద్దాలు చెప్పడంలో తండ్రి చంద్రబాబు నాయుడుతో లోకేష్ పోటీ పడుతున్నారన్నారు. జగన్ పైన పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడంలో టీడీపీ చాకచక్యంగా వ్యవహరింస్తోందన్నారు.

ఇటీవల శాసనసభ సమావేశాల్లో ఇలాగే తెలంగాణ సిఎం కేసీఆర్‌కు జగన్ లేఖ రాశారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారని, అందుకు రుజువు చేయాలని తాము సవాల్ చేశామన్నారు.

ఇంతవరకు దానికి సమాధానం లేదన్నారు. ఇప్పుడు లోకేష్ కూడా అసత్యాలను ప్రచారం చేస్తున్నారన్నారు. ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు. మరోవైపు రుణమాఫీ విషయంలో కూడా ముఖ్యమంత్రి, మంత్రులు ఒక రకంగా, నారా లోకేష్ మరో రకంగా మాట్లాడుతున్నారన్నారు.మాట్లాడుతుంటే, లోకేష్ మరోలా చెబుతున్నారన్నారు.

English summary
YSR Congress Party MLA Roja alleged that there are three psychos in Telugudesam Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X