అతలాకుతలం, ఎండలు.. పిడుగులు - ఆరెంజ్ అలెర్ట్..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. అకాల వర్షాలతో పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసాయి. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వడగండ్లతో నష్టం జరిగింది. పిడుగుపాటుకు నలుగురి మృతి చెందిన ట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌లో గంటన్నర పాటు వాన దంచికొట్టింది. భారీ వర్షం ధాటికి చార్మినార్ నుంచి పెచ్చులు ఊడి పడ్డాయి. ఏపీలోనూ వర్షాలు కొనసాగుతున్నాయి. దీంతో, తాజాగా విపత్తు నిర్వహణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఎండలు - పిడుగులు
తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజులు ఇదే రకమైన భిన్నంగానే వాతావరణం ఉంటుందని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. శుక్రవారం అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో పాటు మోస్తరు వర్షాలు, శనివారం అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది.

ఏపీ జిల్లాల్లో వర్షాలు
కృష్ణా జిల్లా పెద అవుటుపల్లిలో 68.9 మిల్లీ మీటర్లు, ఆత్కూరులో 39 మిల్లీ మీటర్లు, ప్రకాశం జిల్లా సానికవరంలో 65.2 మిల్లీ మీటర్లు, అన్నమయ్య జిల్లా ములకల చెరువులో 57.7 మిల్లీ మీటర్లు, నంద్యాల జిల్లా పెరుసోమలలో 43.2 మిల్లీ మీటర్లు చొప్పున వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 18 ప్రాంతాల్లో 20 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. వైఎస్‌ఆర్ కడప జిల్లా కమలాపురంలో 39.9 డిగ్రీలు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 39.8, అనకాపల్లి జిల్లా వడ్డాది, ఎన్‌టిఆర్ జిల్లా చందర్లపాడులో 39.6 డిగ్రీలు చొప్పున, పల్నాడు జిల్లా రావిపాడులో 39.5 డిగ్రీలు, ఏలూరు జిల్లా రాజుపోతేపల్లిలో 39.4 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.
ఆరెంజ్ అలర్ట్
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, కామారెడ్డి, నిజామా బాద్ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటల పాటు ఇదే రకమైన పరిస్థితుల కు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. హైదరాబాద్‌లో దాదాపు గంటన్నర పాటు వాన దంచి కొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి జనం అవస్థలు పడ్డారు. రోడ్లపై కి.మీ. మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరూర్‌నగర్, హిమాయత్‌నగర్, డబీర్‌పురాలో 8.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications