వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగ‌న్ చిల‌క్కి చెప్పిన‌ట్టు చెప్పారు.. విన‌లేదు.. ఇప్పుడు.. ''ఖేల్ ఖతం.. దుకాణం బంద్!!''

|
Google Oneindia TeluguNews

అన్నివ‌ర్గాల‌కు అందుబాటులో ఉండే ఏకైక వినోద సాధ‌నం సినిమా. ఎవ‌రి ఆర్థిక ప‌రిస్థితిని బ‌ట్టి వారికి అందుబాటులోనే ఉంటుంది. నేల‌, బెంచి, కుర్చీ, బాల్క‌నీ అంటూ నాలుగు ర‌కాల టికెట్ ధ‌ర‌లుంటాయి. ఎవ‌రికి ఏ ధ‌ర అందుబాటులో ఉంటే ఆ ధ‌ర‌కు టికెట్ కొనుగోలుచేసి సినిమా చూసి ఆనందిస్తారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. దీనికి తోడు క‌రోనా తెచ్చిన మార్పులు ఎన్నో. అదే సమయంలో ఓటీటీ వేదిక‌లకు ప్రజలు అలవాటుపడ్డారు.

 మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలి

మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలి

మారుతున్న కాలానికి అనుగుణంగా మారితేనే మ‌నుగ‌డ సాధ్య‌మ‌ని పెద్ద‌వారు చెబుతుంటారు. కానీ ఇవి మార‌డానికి వీలులేనివి. ఎటువంటి అవ‌కాశం లేనివి. అందుకే వాటికి మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌వుతోంది. ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే 1750కి పైగా థియేట‌ర్లు ఉంటే ఈ రెండు సంవ‌త్స‌రాల కాలంలో 432 థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. కొన్ని క‌ల్యాణ‌మండ‌పాల‌య్యాయి. మ‌రికొన్ని క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ అంటూ క్లాసిక‌ల్ పేరు పెట్టుకున్నాయి. ఇంకొన్ని కాంప్లెక్స్‌లుగా మారాయి.

2ఖేల్ ఖతం.. దుకాణం బంద్

2ఖేల్ ఖతం.. దుకాణం బంద్


మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్న వినోద సాధ‌నాన్ని దూరం చేయ‌కూడ‌దు అన్న ఉద్దేశంతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి టికెట్ ధ‌ర‌ల‌ను త‌గ్గించారు. కానీ సినిమా ప‌రిశ్ర‌మ పెద్ద‌లు అభిమానుల‌ను ''క్యాష్'' చేసుకోవాల‌నే ఉద్దేశంతో ముఖ్య‌మంత్రి ద‌గ్గ‌ర‌కు ప‌రుగులు పెట్టి టికెట్ ధ‌ర‌లు పెంచుకునేలా అనుమ‌తులు తెచ్చుకున్నారు. పెట్టుబడిగా పెట్టిన డబ్బంతా ఒక్క వారంలోనే ''లాగించేద్దామనుకున్నారు''. కేవలం ఒక్క ప్రేక్ష‌కుడు ''సినిమా బాగోలేదు'' అని ఒక్క మాట చెబితే చాలు.. మ్యాట్నీ నుంచి ఆ సినిమా 'ఖేల్' ఖ‌త‌మ‌వుతోంది. ఇందుకు 'ఆచార్య' సినిమానే ఉదాహ‌ర‌ణ‌.

థియేటర్లకు వెళ్లడం అనవసరమనుకుంటున్న ప్రజలు?

థియేటర్లకు వెళ్లడం అనవసరమనుకుంటున్న ప్రజలు?


సినిమాకు భారీగా ఖ‌ర్చుపెట్టామ‌ని, డ‌బ్బులు రావ‌ని, అవి రావాలంటే ధ‌ర‌లు పెంచుకోవాలంటూ అనుమ‌తులు తెచ్చుకున్నారు. పెరిగిన ధ‌ర‌ల‌తో థియేట‌ర్‌కు వెళ్ల‌డం అన‌వ‌స‌రం అనుకున్నారు.. ప్రేక్ష‌కులు. అంతే.. ఒక్క‌సారిగా 432 థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. ముఖ్య‌మంత్రి ప‌దే ప‌దే చెప్పిన‌ప్ప‌టికీ వాటిని పెడ‌చెవిన పెట్టి మ‌రీ టికెట్ ధ‌ర‌లు పెంచి అభిమానుల‌ను బాదేశారు. ఎంత మంచి సినిమా విడుద‌లైన‌ప్ప‌టికీ ప్రేక్ష‌కులు మాత్రం థియేట‌ర్‌కు రావ‌డంలేదు. కుటుంబ స‌భ్యులతో సినిమాకు అనేది ప్ర‌జ‌లు ఎప్పుడో మ‌రిచిపోయారు.

డబ్బు మీద వ్యామోహంతో కూర్చున్న కొమ్మనే నరుక్కోకూడదు!!

డబ్బు మీద వ్యామోహంతో కూర్చున్న కొమ్మనే నరుక్కోకూడదు!!


ఒక్క థియేటర్ మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవిస్తుంటాయి. ఇప్పుడు మూతపడిన థియేటర్లలో పనిచేసేవారికి ఎవరు ఉపాధి కల్పిస్తారు? కేవలం డబ్బు మీద వ్యామోహంతో వారంలోనే కలెక్షన్లు కొల్లగొడదామనుకున్న సినీ పెద్దలు కల్పిస్తారా? కల్పించరు. తెరపై కనపడే కథానాయకుడు వేరు.. నిజజీవిత కథానాయకుడు వేరు. తక్కువ టికెట్ ధరలతో ఎక్కువ రోజులు సినిమా రన్ అయినా ఇబ్బంది లేకుండా డబ్బులు వచ్చేస్తాయి. వారానికే అని ఆశపడితే అందరూ రోడ్డున పడాల్సి వస్తుందనే విషయాన్ని మరవకూడదు.!!

English summary
The increase in ticket prices of movie theaters has now threatened their survival.432 theaters were closed across the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X