ఆళ్ల నాని టీడీపీలోకి అఫిషియల్ ఎంట్రీ.. ముహూర్తం ఫిక్స్
మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నేడు అధికారికంగా టీడీపీలో చేరనున్నట్టు ప్రచారం జోరందుకుంది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన ఆళ్ల నాని మూడు నెలల క్రితం పార్టీకి, ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికు గుడ్ బై చెప్పారు. అప్పటినుంచి ఎవరికీ అందుబాటులో లేని ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన సైకిల్ ఎక్కబోతున్నారని అనుకుంటున్నారు. ఇక ఇప్పటికే టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు ఆళ్ల నాని. ఆళ్ల నాని మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు.
గత కొన్ని నెలలుగా ఆయన టీడీపీలో చేరతారని టాక్ నడుస్తోంది. అయితే నాని చేరికపై టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆయన చేరికతో కేడర్‌లో మరింత అసంతృప్తి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ ఆలోచనలో పడింది. దీంతో ఇప్పటికే పలుమార్లు ఆళ్ల నాని టీడీపీలో చేరిక అంశం వాయిదా పడుతూ వచ్చింది. మరోమారు నానిని పార్టీలోకి తీసుకోవాలా వద్దా అనే విషయంపై అధిష్టానం పునరాలోచనలో పడింది. కానీ మొత్తానికి ఆళ్ల నాని టీడీపీ నేతలతో చర్చలు జరపగా.. గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వకపోయినా.. పార్టీలో స్వచ్ఛందంగా చేరేందుకే నాని ఓకే చెప్పినట్లు సమాచారం.

ఆళ్ల నానిని చేరిక అంశంపై టీడీపీలో మొదటి నుంచి చర్చ నడుస్తూనే ఉంది. 2024 ఎన్నికల్లో ఏలూరులో 60 వేలకు పైగా మెజారిటీతో గెలిచిన టీడీపీకి వైసీపీ నాయకుల అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. గతంలో అధికారంలో ఉండగా.. టీడీపీ నేతలు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన ఆళ్ల నాని.. ఇప్పుడు టీడీపీలో చేరడానికి ఎలా ఓకే చెబుతామని ఏలూరులో పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆళ్ల నాని 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ సమయంలో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఏలూరు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జగన్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. 2019 ఎన్నికల్లో మళ్లీ ఆళ్ల నానికి ఏలూరు నుంచి వైసీపీ టికెట్ ఇచ్చారు జగన్. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆళ్ల నాని.. జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా రెండున్నరేళ్ల పాటూ పనిచేశారు.
ఇక గత ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ తరఫున పోటీ చేసి ఇతమి పాలయ్యారు. మొదట్లో ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ చివరకు తెలుగు దేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడంతో సైకిల్ ఎక్కబోతున్నట్టు క్లారిటీ వచ్చింది. నానికి అత్యంత సన్నిహితుడు, విజయనగరం జిల్లాకు చెందిన ఓ కీలక టీడీపీ నేత అధిష్టానంతో చర్చించి తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇప్పించినట్టు తెలుస్తోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications