మారను, సహకరించను: కిరణ్, మేమూ తగ్గం: జివోఎం!
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రుల బృందంతో (జివోఎం)తో సుదీర్ఘంగా గంటన్నర పాటు భేటీ అయ్యారు. తాను రాష్ట్ర విభజనకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదని కిరణ్ జివోఎం సభ్యులతో చెప్పగా, తాము తగ్దేది లేదని జివోఎం సభ్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది.
జివోఎంతో భేటీ అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి ముఖంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆయన పన్నెండు గంటల యాభై నిమిషాలకు లోనికి వెళ్లారు. రెండుగంటల ఇరవై నిమిషాలకు బయటకు వచ్చారు. లోపలకు వెళ్లేటప్పుడు ఎలా కాన్ఫిడెన్స్‌తో ఉన్నారో.. బయటకు వచ్చినప్పుడు అంతే కాన్ఫిడెన్స్‌తో కనిపించారు.

విభజన చారిత్రాత్మిక తప్పిదమని, తాను ఎట్టి పరిస్థితుల్లో అందుకు సహకరించలేనని కిరణ్ చెప్పారని అంటున్నారు. అందుకు జివోఎం కూడా ఇచ్చిన మాట మేరకు తాము వెనక్కి తగ్గడం కష్టమని చెప్పారట. విభజనతో ఇరు ప్రాంతాలకు నష్టమని, రాజకీయంగా కాంగ్రెసు బాగా దెబ్బ తింటుందని కిరణ్ వారికి చెప్పారు. విద్యుత్, ఉపాధి, శాంతిభద్రతలు అన్నింటా అన్ని ప్రాంతాలు దెబ్బతింటాయని చెప్పారు.
కాగా, జివోఎంతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేరుగా ఎపి భవన్ వెళ్లారు. ఆయన మూడు గంటలకు విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు.












Click it and Unblock the Notifications