తిరుమల బ్రహ్మోత్సవాలు
చిత్తూరు: శ్రీవేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా స్వామివారి చక్రస్నానం ఘట్టం మంగళవారం శాస్త్రోక్తంగా జరిగింది. రాత్రి జరిగిన ధ్వజావరోహణంతో ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా భక్తకోటికి విశేష సేవలందించింది. ఇదివరకు ఎన్నడూలేనంతగా సౌకర్యాల కల్పనతో పలు అంశాలు రికార్డుకెక్కాయి. శ్రీవారి మూలవిరాట్టు, వాహనసేవల దర్శనం, లడ్డూ ప్రసాద, అన్నప్రసాద వితరణ, మహా ప్రదర్శనలతో పాటు ఇతరత్రా అంశాల్లో భక్తులను తితిదే విశేషంగా ఆకట్టుకుంది. శ్రీవారి మూలవిరాట్టును 7,99,430 మందికి దర్శనం కల్పించి గత ఏడాది కంటే 2.23 లక్షల మంది యాత్రికులు అధికం.












Click it and Unblock the Notifications