శ్రీవారి దర్శనాల్లో వైసీపీకి ప్రయార్టీ? విమర్శలపై టీటీడీ క్లారిటీ..!
ఏపీలో ఏ పార్టీ లేదా కూటమి అధికారంలో ఉన్నా తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో వారికే ప్రాధాన్యం దక్కుతుందని, విపక్ష పార్టీలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉంటూనే ఉంటాయి. ఇందుకు తగినట్లుగానే అధికార పార్టీలు నియమించిన టీటీడీ బోర్డుల వ్యవహారశైలి కూడా ఉంటుందనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. అయితే తాజాగా ఇదే క్రమంలో విపక్ష వైసీపీ నేతలకు టీటీడీ దర్శనాల విషయంలో షాకులిస్తోందనే ప్రచారం జరుగుతోంది.
తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో తమను బోర్డు పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. టీటీడీ బోర్డు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. అదే సమయంలో అధికార కూటమి నేతలు కూడా విపక్షంలో ఉన్నా వైసీపీ నేతలకు దర్శనాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఇవాళ టీటీడీ ఈ వ్యవహారపై స్పందించింది.

వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులకు దర్శనాలు కల్పించే విషయంలో టీటీడీ బోర్డు తమ వైఖరిని స్పష్టం చేసింది. వైసీపీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీలకు మాత్రమే వారి కోటాలో దర్శనాలు కల్పిస్తున్నట్లు టీటీడీ తేల్చిచెప్పేసింది. వైసీపీ నేతలకు మాత్రం ఎలాంటి కోటా లేదని తెలిపింది. ఈ విషయంలో వచ్చిన విమర్శల్ని తోసిపుచ్చింది. తద్వారా వైసీపీ ప్రజాప్రతినిధులకు నిబంధనల ప్రకారం మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నట్లు తెలిపింది. దీనిపై అధికార కూటమి ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications