పెరగనున్న తిరుమల లడ్డు ధర: అమల్లోకి 25నుంచే
తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో లభించే లడ్డూ ప్రసాదం ధరలు పెరగనున్నాయి. అయితే దర్శనం టికెట్‌పై పొందే లడ్డూల ధరలు యధాతథంగా వుంటాయని, సామాన్య భక్తులకు అందించే లడ్డూ ధరల్లోనూ ఎలాంటి మార్పు వుండదని టీటీడీ స్పష్టం చేసింది.
ఇక సర్వదర్శనం, దివ్యదర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారికి రాయితీ పద్ధతిలో టీటీడీ లడ్డూలను అందజేస్తూ వుంటుంది. రాయితీ లడ్డూలు కాకుండా ఎక్కువ లడ్డూలు కావాలంటే కొంచెం ఎక్కువగా చెల్లించాల్సి వుంటుంది.

కొందరు ఎక్కువ మొత్తంలో లడ్డూలు కొనుగోలు చేయడానికి సిఫార్సు లేఖలు సైతం ఇస్తుంటారు. అలాంటి సిఫార్సు లేఖలపై జారీచేసే లడ్డూల ధరలను పెంచే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం అడుగులు వేస్తోంది.
ఈ క్రమంలోనే కల్యాణోత్సవం లడ్డూ ధర రూ.200, వడ ధర రూ.100గా టీటీడీ రేటును ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 25వ తేదీ నుంచి పెరిగే ధరలు అమల్లోకి రానున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications