తిరుమల గోవిందుడికి కళంకం తెచ్చిన చంద్రబాబు: లక్ష్మీ పార్వతి ధ్వజం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల లడ్డు కల్తీ పైన రగడ కొనసాగుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డులో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చేసిన వ్యాఖ్యలతో మొదలైన దుమారం, ల్యాబ్ రిపోర్ట్ లతో వైసిపి పైన దాడి చేసేదాకా వెళ్ళింది. ఏకంగా జగన్ ఇంటి వద్ద బిజెపి ఆందోళనల పర్వం కూడా కొనసాగుతుంది.
తిరుమల శ్రీవారిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు రాజకీయం
ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఎన్డీఏ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి నాయకుల మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏకంగా తిరుమల శ్రీవారిని అడ్డుపెట్టుకున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు ఎంత నీచానికైనా సిద్ధం: లక్ష్మీ పార్వతి
తాజాగా చంద్రబాబు పైన మండిపడిన మాజీ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె చంద్రబాబు తన స్వార్ధ రాజకీయాల కోసం ఎంత నీచనికైనా వెనకాడడు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఈరోజు దేవుడితో ఆటలాడుతున్నాడని లడ్డు తయారీలో ఎటువంటి కల్తీ నెయ్యి వాడలేదని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.
చంద్రబాబు వల్లే తిరుమల గోవిందుడికి కళంకం
కావాలని జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడం కోసమే చంద్రబాబు ఈ డ్రామాకు తెరతీసారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డు తయారీ వందల ఏళ్లుగా సాగుతున్న అనవాయతీ అని, చంద్రబాబు హయాంలో నెయ్యిలో కల్తీ జరిగితే తనపై నింద రాకుండా జగన్ పైన నింద వేస్తున్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వలన తిరుమల గోవిందుడు కి కూడా కళంకం వచ్చిందని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు.
చంద్రబాబుకు నిలువెల్లా విషమే
స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా వెనుకాడడు అంటూ పేర్కొన్న ఆమె చంద్రబాబుకు నిలువెల్లా విషమే ఉందని విమర్శలు గుప్పించారు. మరోవైపు వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా చంద్రబాబు పైన మాటల తూటాలను పేలుస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేని చంద్రబాబు ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా తిరుమల శ్రీవారి లడ్డూల వ్యవహారాన్ని తెచ్చారని వైసీపీ నేతలు నిపులు చెరుగుతున్నారు.
జగన్ ను రాజకీయంగా అంతం చెయ్యాలనే చంద్రబాబు కుట్రలు
జగన్ పైన ఇటువంటి ఆరోపణలు చేసి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ను రాజకీయంగా అంతం చేసేందుకే చంద్రబాబు ఈ విధంగా కుట్రలకు పాల్పడ్డారని చంద్రబాబు పైన వైసిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విష ప్రచారాన్ని సహించేది లేదని వారు తేల్చి చెబుతున్నారు.












Click it and Unblock the Notifications