తిరుమల లడ్డూపై ఆరోపణలతో కష్టాలు మొదలయ్యాయా?

Tirumala Laddu row: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం.. చిలికి చిలికి గాలీవానగా మారింది. రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఆరోపణలు- ప్రత్యారోపణలకు కారణమైంది.

కలియుగ వైకుంఠంలా అలరారుతున్న, సాక్షాత్ శ్రీమహావిష్ణువే కొలువుదీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోట్లాదిమంది హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది.

Tirumala Laddu row YSRCP MP Vijayasai Reddy lashes out at CM Chandrababu

తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తోన్నారని, నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తోన్నారంటూ చంద్రబాబు రెండు రోజుల కిందట ఆరోపించిన విషయం తెలిసిందే. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు- సరికొత్త వివాదానికి తెర తీసినట్టయింది.

దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్ అటాక్‌కు దిగారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే నెయ్యిలో కల్తీ జరిగిందంటూ ఆరోపిస్తోన్నారు. తేదీలతో సహా వివరణ ఇస్తోన్నారు. చంద్రబాబు ఆరోపణలను డైవర్షన్ పాలిటిక్స్‌గా అభివర్ణిస్తోన్నారు.

Tirumala Laddu row YSRCP MP Vijayasai Reddy lashes out at CM Chandrababu

తాజాగా ఈ వివాదంపై వైసీపీ సీనియర్ నేత, పార్లమెంటరీ పార్టీ చీఫ వీ విజయసాయి రెడ్డి మరోసారి స్పందించారు. తిరుమల లడ్డూ పవిత్రను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరిస్తోన్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేశారని, దీన్నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి తిరుమల శ్రీవారిని సైతం రాజకీయాల్లోకి లాగారని విమర్శించారు.

తిరుమల లడ్డూ మీద చంద్రబాబు చేసే యాగీ అంతా కూడా తన సొంత సంస్థ హెరిటేజ్ నెయ్యి టీటీడీకి అధిక ధరకు అమ్మి సొమ్ముచేసుకోవడం కోసమేనా లేక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని దృష్టి మళ్లించే కుట్రనా అంటూ ప్రశ్నించారు.

అమరావతి రాజధానిగా పనికిరాదంటూ ప్రపంచ బ్యాంక్ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఆయన అనుయాయులు కొన్న భూముల ధరలు పడిపోయాయని భాదతో కక్కిన అక్కసా అంటూ ప్రశ్నించారు. సూపర్ డూపర్ సిక్స అంతా బోగస్ అని ప్రజలకు తెలిసిపోయిందన్న బాధలో తిరుమల లడ్డూపై ఆరోపణలు చేశారా అంటూ నిలదీశారు. చంద్రబాబుకు కష్టాలొచ్చిపడ్డాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+