తిరుమల లడ్డూ వివాదం: టీటీడీ సంచలనం- శ్రీవారి నైవేద్యంలో అవి రద్దు..!!
Tirumala Laddu row: పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం.. చిలికి చిలికి గాలీవానగా మారింది. రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఆరోపణలు- ప్రత్యారోపణలకు కారణమైంది.
కలియుగ వైకుంఠంలా అలరారుతున్న, సాక్షాత్ శ్రీమహావిష్ణువే కొలువుదీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోట్లాదిమంది హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది.

తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తోన్నారని, నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తోన్నారంటూ చంద్రబాబు రెండు రోజుల కిందట ఆరోపించిన విషయం తెలిసిందే. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు- సరికొత్త వివాదానికి తెర తీసినట్టయింది.
ఈ పరిణామాల తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తిరుమల ఆలయంలో శ్రీవారికి నైవేద్యంగా పెట్టే అన్న ప్రసాదాల తయారీకి సంబంధించిన నిర్ణయం ఇది. వార్షిక బ్రహ్మోత్సవాలు ఇంకొద్దిరోజుల్లో ప్రారంభం కాబోతోన్న నేపథ్యంలో దీన్ని అమలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
శ్రీవారి అన్నప్రసాదాల్లో వినియోగించే నెయ్యి, బెల్లం, బియ్యం వంటి గో ఆధారిత ముడి సరుకులను రద్దు చేసింది. ఇది తాత్కాలికమేనని టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు తెలిపారు. శ్రీవారి నైవేద్యంలో ఈ ముడి సరుకులను వినియోగించాలా? లేక పూర్తిగా రద్దు చేయాలా? అనే విషయంలో త్వరలో ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయాలను తీసుకుంటామని చెప్పారు.
సంధి తిరుప్పానకం, తిరుప్పానకం, రజన తిరుప్పానకం, వెళ్లై తిరుప్పానకం, దద్దోజనం, తిరుప్పావడ, తిరువళక్కం, తిలాన్నం, పంచవాహి, అప్పాలు, అరిసెలు, లడ్డూ వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. దీని తయారీ కోసం గో ఆధారిత నెయ్యి, బెల్లం, బియ్యం వినియోగిస్తుంటారు. ప్రస్తుత లడ్డూ వివాదం నేపథ్యంలో వాటి వినియోగాన్ని రద్దు చేసింది.












Click it and Unblock the Notifications