Tirumala Laddu: చంద్రబాబు ఏ మాత్రం ఊహించని ఎత్తువేసిన జగన్

YS Jagan on Tirumala Laddu row: పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం.. చిలికి చిలికి గాలీవానగా మారింది. రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో మాటల యుద్ధానికి తెరతీసింది. ఆరోపణలు- ప్రత్యారోపణలకు కారణమైంది.

జాతీయ స్థాయిలో..

కలియుగ వైకుంఠంలా అలరారుతున్న, సాక్షాత్ శ్రీమహావిష్ణువే కొలువుదీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోట్లాదిమంది హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది.

Tirumala Laddu YS Jagan to write PM Modi and CJI DY Chandrachud

నెయ్యికి బదులు..

తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తోన్నారని, నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తోన్నారంటూ చంద్రబాబు రెండు రోజుల కిందట ఆరోపించిన విషయం తెలిసిందే. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు- సరికొత్త వివాదానికి తెర తీసినట్టయింది.

జగన్ ఏం చెప్పారు?

దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఎప్పుడేం జరిగిందో వివరించారు. జూన్ 4వ తేదీన రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, జులై 12వ తేదీన నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారని గుర్తు చేశారు. 17వ తేదీన అక్కడ టెస్టులు చేశాక రిపోర్టులు సరిగ్గా రాకపోవడంతో ఎన్డీడీబీకి పంపించారని వివరించారు.

బాబు హయాంలోనే..

శ్రీవారికి పంపించిన నెయ్యిలో యానిమల ఫ్యాట్ ఉందనే విషయాన్ని నిర్ధారిస్తూ ఎన్డీడీబీ అదే నెల 23వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానానికి నివేదిక పంపించిందని వివరించారు. జంతువుల కొవ్వు ఉండటం వల్ల టీటీడీ అధికారులు ఈ నెయ్యిని లడ్డూ తయారీ కోసం వినియోగించలేదని పేర్కొన్నారు. జులై 23వ తేదీన నివేదిక అందింతే ఈ రెండు నెలలు చంద్రబాబు ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు.

Tirumala Laddu YS Jagan to write PM Modi and CJI DY Chandrachud

రెండు నెలలు ఎందుకు?

ఈ విషయాన్ని అప్పుడే ఎందుకు బయటపెట్టలేదని, ఎందుకు రెండు నెలల పాటు ఆగారని నిలదీశారు. జంతువుల కొవ్వు శాతం ఉన్న నెయ్యిని చంద్రబాబు ప్రభుత్వంలోని టీటీడీ అధికారులు లడ్డూ తయారీకి వినియోగించకపోయినా ఎందుకు ప్రస్తావించారని అన్నారు. చంద్రబాబు ఆడుతున్న డైవర్షన్ పాలిటిక్స్‌గా అభివర్ణించారు. సూపర్ 6 నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తిరుమల లడ్డూ అంశాన్ని తెరపై తెచ్చారని ఆరోపించారు.

మరింత ముందుకు..

ఈ వివాదాన్ని అక్కడితో వదిలేయదలచుకోలేదు వైఎస్ జగన్. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లదలిచారు. ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. వారిద్దరికీ లేఖ రాయనున్నట్లు జగన్ ప్రకటించారు.

వాస్తవాల వక్రీకరణ..

తిరుమల లడ్డూ విషయంలో వాస్తవాలను చంద్రబాబు ఎలా వక్రీకరించారనేది ఈ లేఖ ద్వారా ప్రధాని మోదీ, సీజేఐ డీవై చంద్రచూడ్‌కు సమగ్రంగా వివరిస్తానని, ఆధారాలను జత చేస్తానని జగన్ పేర్కొన్నారు. ఆయనపై ఎందుకు చర్య తీసుకోకూడదని కోరుతానని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+