Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 57,682 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,020 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.65 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది.

వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ చర్యలు చేపట్టింది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కా ప్రణాళికలను రూపొందించుకుంటోంది. దీనిపై టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు- మూడు సంవత్సరాల వేసవి డేటాను పరిగణనలోకి తీసుకుని భక్తుల సంఖ్య, వేచి ఉండే సమయం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

Tirumala Rolls Out Summer Preparedness Smooth Quick Darshan All During Upcoming Summer Vacation

భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అన్నప్రసాదం, మంచినీటి పంపిణీ, నడక దారి భక్తులకు మార్గమధ్యలో షెడ్ల ఏర్పాటు, మాడ వీధులు తదితర ప్రాంతాల్లో కూల్ పెయింటింగ్ వేయాలని నిర్ణయించారు. అలాగే మజ్జిగ పంపిణీ పాయింట్ల సంఖ్యను పెంచి వేసవిలో భక్తుల దాహార్తిని తీర్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. వసతి సదుపాయాలు, అన్నప్రసాదం నిర్వహణను మరింత సమర్థంగా అమలు చేయనున్నారు. నడకదారి భక్తులు, అధిక రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తారు.

వేసవిలో కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో సామాన్య భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడం, వారికి వీలైనంత త్వరగా దర్శనం కలిగేలా చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అదనపు ఈవో తెలిపారు. ఈసారి ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచి, కంపార్ట్ మెంట్లల్లో రద్దీ, గంటల వారీగా ఇన్- అవుట్ ఫ్లో, వేచి ఉండే సమయాన్ని ప్రతి నిమిషం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట తక్షణ నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

గత వేసవిలో జూన్ నెలలో సగటున రోజుకు 80 వేల నుంచి 82 వేల మందికి దర్శనం కల్పించామని, అలాగే 2026 జనవరిలో రోజుకు సగటున 74 వేల మందికి పైగా దర్శనం కల్పించినట్లు గుర్తు చేశారు. ఇది సమర్థవంతమైన టైమ్ మేనేజ్‌మెంట్, అన్ని విభాగాల సమన్వయంతో సాధ్యమైందని వివరించారు.వేసవిలో భక్తులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయని అదనపు ఈవో ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+