TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - దర్శనానికి నో వెయిటింగ్..!!

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కొండకు చేరిన భక్తులకు గుడ్ న్యూస్. నేడు శ్రీవారి దర్శనానికి భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 1 కంపార్టుమెంటులో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. నేడు టోకెన్ రహిత సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడా క్యూలైన్ లో ఎక్కడా వేచి ఉండకుండా నేరుగా వెళ్లిపోయేటంత ఖాళీగా ఉంది.

భక్తుల రద్దీ స్వల్పం:తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా ఉంది. సర్వ దర్శనం కోసం ఒక 1 కంపార్టుమెంటులో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. నేడు టోకెన్ రహిత సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 85,258 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.28 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 25,451 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కొన్ని రోజుల క్రితం వరకూ శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూసేవారు. ఇప్పుడు ఎక్కడా భక్తులు వేచి ఉండకుండా నేరుగా స్వామివారిని దర్శించుకుంటున్నారు.

Tirumala Srivari devotees can darshan without waiting in the regular queue,Taking four hours time

ప్రత్యేక ఉత్సవాలు:తిరుమలలో ఆగస్టు నెలలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. అదే విధంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆగస్టు నెలలో జరగనున్న విశేష ఉత్సవాల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆగస్టు 1, 31వ తేదీల్లో సాయంత్రం స్వామివారు గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఆగస్టు 11వ తేదీ రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకొని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామి వారు సాయంత్రం తిరుచ్చిపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆగస్టు 14వ తేదీ పునర్వసు నక్షత్రం సందర్భంగా సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి తిరుచిపై ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగనున్నారు.

కొత్త పాలక వర్గం:ఆగస్టు 29వ తేదీ శ్రావణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంటేశ్వరస్వామి సాయంత్రం తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు భక్తులను అనుగ్రహించునున్నారు. ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ సిద్దం అవుతోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 7న టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రస్తుత పాలకవర్గ పదవీ కాలం ముగుస్తుండటంతో..టీటీడీ కొత్త బోర్డు ఏర్పాటు పైన ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. కొత్త ఛైర్మన్ గా పలువురి పేర్లు ప్రచారం ఉండగా,, జంగా క్రిష్ణమూర్తి పేరు ఖరారయ్యే అవకాశం ఉందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+