Tirumala: సంపన్న ఆలయాల్లో తిరుమల శ్రీవారి ఆలయం ఏ ప్లేస్ లో ఉందంటే
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన ఆలయాలు మాత్రమే కాదు భారీసంపదకు నిలయమైన ఆలయాలు కూడా మనదేశంలో ఉన్నాయి. అటువంటి ఆలయాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధ క్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయం ఏ స్థానంలో ఉంది. శ్రీవారి ఆలయానికి ఉన్న అంతర్జాతీయ విశిష్టత నేపథ్యంలో సంపదలో తిరుమల ఆలయం స్థానం ఎక్కడ? అనేది తెలుసుకోవాలని చాలామంది భావిస్తూ ఉంటారు. అటువంటి వారి కోసమే ఈ కథనం.
దేశంలోనే తొలి సంపన్న ఆలయం ఇదే
భారతదేశంలో ఉన్న దేవాలయాలు కేవలం మతపరమైన క్షేత్రాలు మాత్రమే కాదు. అవి భారీగా సంపదలకు నిలయాలుగా కూడా పేరు పొందాయి. అటువంటి దేవాలయాలలో మొదటి స్థానంలో నిలిచింది శ్రీ పద్మనాభ స్వామి ఆలయం. తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయం దేశంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయంగా గుర్తింపు పొందింది. దీని రహస్య భూగర్భ గదులలో దాదాపు ఒక లక్ష కోట్ల విలువైన బంగారం, రత్నాలు, కిరీటాలు దాచి ఉంచబడ్డాయి.

సంపన్న ఆలయాల్లో తిరుమల శ్రీవారి ఆలయం స్థానం ఇదే
ఈ ఆలయంలో 500 కోట్ల విలువైన మహావిష్ణువు బంగారు విగ్రహం కూడా ఉందని చెబుతారు. ఈ ఆలయం మొత్తం సంపద ఒక లక్ష ఇరవై వేల కోట్లుగా అంచనా వేయబడింది.పద్మనాభస్వామి ఆలయం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. భారతదేశంలోనే అత్యంత రెండవ సంపన్నమైన ఆలయంగా గుర్తింపు పొందింది.
తిరుమల ఆలయ సంపద ఇదే
పదవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయానికి ప్రతిరోజు 50.37 కోట్ల విలువైన విరాళాలు అందుతాయి. ఆలయ ఖజానాలో 52 టన్నుల కంటే ఎక్కువ బంగారం నిల్వ ఉంది. ప్రతి సంవత్సరం మూడు వేల కిలోల కన్నా ఎక్కువ బంగారం సేకరించబడుతుంది. ప్రతి సంవత్సరం విరాళాల రూపంలో దాదాపు 650 కోట్లు తిరుమల శ్రీవారి ఆలయానికి సమకూరుతాయని ఒక అంచనా ఉంది.
వైష్ణోదేవి ఆలయ సంపద తెలుసా
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తర్వాత వైష్ణో దేవి ఆలయాన్ని ప్రతి సంవత్సరం కోటి మందికి పైగా భక్తులు సందర్శిస్తారు. ఇక్కడ వైష్ణో దేవి ఆలయంలో సుమారు 1.2 టన్నుల బంగారం ఉందని చెప్తారు. ప్రతి సంవత్సరం 500 కోట్ల విలువైన విరాళాలు వైష్ణో దేవి కి వస్తాయి. భారతదేశంలోని సంపన్న ఆలయాలలో ఇది ఒకటిగా నిలుస్తుంది.
షిరిడీ సాయిబాబా ఆలయానికి ఉన్న సంపద ఇలా
ఆ తర్వాత స్థానంలో షిరిడీలోని సాయిబాబా ఆలయం నిలిచింది. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన యాత్ర స్థలాలలో ఒకటిగా గుర్తింపు ఉన్న షిరిడి సాయిబాబా ఆలయం మొత్తం సంపద సుమారు 2000 కోట్లు. ఈ ఆలయానికి 1800కోట్ల బ్యాంకు నిల్వ ఉంది. 380 కిలోల బంగారం, 4400 కిలోల కంటే ఎక్కువ వెండి మరియు విదేశీ కరెన్సీ నిల్వ ఉంది. అత్యంత ధనిక ఆలయంగా షిర్డీలోని సాయిబాబా ఆలయం స్థానం దక్కించుకుంది.
ఐదవ స్థానంలో స్వర్ణ దేవాలయం
ఇక ఆ తర్వాత స్థానంలో మనం స్వర్ణ దేవాలయం గా పిలిచే శ్రీ హర్మందిర్ సాహిబ్ ఆలయం నిలిచింది. పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న సిక్కు మతానికి చెందిన అత్యంత పవిత్రమైన ఆలయం ఈ స్వర్ణ దేవాలయం బంగారాన్ని పాలరాయి ని ఉపయోగించి 1830లో మహారాజా రంజిత్ సింగ్ దీనిని పునర్నిర్మించారు. ఇది మనసు స్వచ్ఛత శ్రేయస్సుకు చిహ్నంగా భావించే ఆలయం ఇది కూడా అత్యంత ధనిక మైన ఆలయంలో ఒకటిగా గుర్తింపు పొందింది.












Click it and Unblock the Notifications