తిరుమలలో కొద్దిరోజులు ఆ దర్శనాలకు బ్రేక్...ఎందుకో తెలుసా?
తిరుమలలో కొద్దిరోజులు ఆ దర్శనాలకు బ్రేక్...ఎందుకో తెలుసా : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. నిత్యం ఇక్కడికి వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. స్వామివారి దర్శనానికి ప్రముఖులు, రాజకీయనాయకులు, సెలబ్రిటీలు కూడా వస్తుంటారు. అయితే, అలాంటివారికోసం ఇక్కడ వీఐపీ దర్శనం అని ఉంటుంది. ఈ దర్శనాలు ప్రతి రోజూ ఉదయం ఉంటాయి. ఈ దర్శనాలకు కొన్ని నియమాలు ఉంటాయి. కొన్ని సిఫారసు లేఖల ద్వారా వీఐపీ దర్శనాలు ఉంటాయి. అయితే, ఇప్పడు తిరుమల వీఐపీ దర్శనాలకు బ్రేక్ పడనుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
మరికొద్దిరోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వీఐపీ దర్శనాల గురించి ఓ చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజుల నుంచి వీఐపీ దర్శనాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంటే, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక తిరుమలలో సిఫార్సు లేఖల స్వీకరణ జరగదు. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు నేరుగా వస్తేనే వీఐపీ దర్శనాలకు అనుమతి ఉంటుందని సమాచారం.

ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం తిరుమలలో వీఐపీ దర్శనాలకు బ్రేక్ : ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం తిరుమలలో ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖల అనుమతి ఉండదని తెలుస్తోంది. నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించే స్వామివారికి సర్వ దర్శనం, ఆర్జిత సేవలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు, వీఐపీ దర్శనాలనేవి ఉంటాయి. ఇందులో ముఖ్యంగా వీఐపీ దర్శనాలంటే రాజ్యాంగ బద్ధ హోదాలో ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబంతో సహా వీఐపీ, శ్రీవారి ఆర్జిత నిత్య సేవల్లో పాల్గొనేందుగా వీలుగా ఉంటుంది. వీటిలో ప్రజా ప్రతినిధులు వారి అనుచర వర్గానికి, నియోజకవర్గ ప్రజలకు వారి సిఫార్సు లేఖ ద్వారా ఈ వీఐపీ దర్శనాలను పొందతుంటారు. ఈ సిఫార్సు లేఖలు తీసుకొచ్చిన వారు ముందు రోజు తిరుమలలోని అడిషనల్ ఈవో కార్యాలయంలో దర్శనం కోసం అభ్యర్థన పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఇక, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తుల రద్దీనీ దృష్టిలో ఉంచుకుని ఈ వీఐపీ దర్శనాలకు స్లాట్ కేటాయించడం జరుగుతుంది. రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, కేంద్ర మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫార్సులపై వీఐపీ దర్శనాలు ఉంటాయి. అయితే, ఎన్నికల సమీపంలో వీఐపీ దర్శనాలకు బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే తిరుమలలో ఈ సిఫార్సు లేఖల్ని స్వీకరించడం జరగదని తెలుస్తోంది. వీఐపీ దర్శనం తీసుకోవాలంటే కొన్ని నియమాలను పాటించాల్సి ఉన్నట్లు సమాచారం. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు నేరుగా వస్తేనే వీఐపీ దర్శనాలకు టీటీడీ అనుమతివ్వనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications