Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lunar Eclipse: తిరుమల, శ్రీశైలం, ఇంద్రకీలాద్రి ద్వారాల మూసివేత - వేళలు ఇలా..!!

ఈ నెల 28వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం కారణంగా 28 వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు అనగా 29 న ఉదయం 5 వరకు ఆలయద్వారాలను మూసివేయనున్నారు. అక్టోబర్‌ 29వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం కారణంగా అక్టోబర్‌ 28న రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేసి అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తారు. దాదాపు ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి.

పాక్షిక చంద్రగ్రహణం
అక్టోబర్‌ 29వ తేదీ తెల్లవారుజామున 1.05 నుండి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. ఈ కారణంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని అక్టోబరు 28న సాయంత్రం 6 గంటలకు మూసివేసి అక్టోబరు 29న ఉదయం 9 గంటలకు తెరుస్తారు. ఈ సమయంలో అన్నప్రసాదాల పంపిణీ ఉండదు. అదేవిధంగా, అక్టోబర్‌ 28న సహస్రదీపాలంకారసేవను, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది.

Tirumala temple will remain closed on the night of October 28 due to partial Lunar eclipse

భ‌క్తులు ఈ విష‌యాల‌ను గ‌మ‌నించి అసౌక‌ర్యానికి గురికాకుండా తిరుమ‌ల యాత్ర‌కు ప్ర‌ణాళిక రూపొందించుకోవాల‌ని టీటీడీ అధికారులు సూచిస్తన్నారు. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా అక్టోబ‌రు 28న టీటీడీ స్థానిక ఆలయాల మూత పడనున్నాయి.

ఆలయ ద్వారాల మూసివేత
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబ‌రు 28న సాయంత్రం 5 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు మూసివేస్తారు. తిరిగి అక్టోబ‌రు 29న తెల్లవారుజామున 4.30 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరుస్తారు. శుద్ధి అనంత‌రం ఉదయం 7 గంట‌ల నుండి భ‌క్తుల‌కు స‌ర్వదర్శనం క‌ల్పిస్తారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వరస్వామివారి ఆల‌యాల్లో అక్టోబ‌రు 28న రాత్రి 7 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు మూసివేస్తారు. శుద్ధి అనంత‌రం భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

శ్రీశైలం మల్లన్న ఆలయం ఈ నెల 28వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం కారణంగా 28 వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు అనగా 29 న ఉదయం 5 వరకు ఆలయద్వారాలను మూసివేయనున్నారు.

ఆ తరువాతనే దర్శనం
29 ఉదయం 5 గంటలకు ఆలయద్వారాలు తెరచి ఆలయశుద్ధి. సంప్రోక్షణ, ప్రాతఃకాల పూజల అనంతరం 7 గంటల నుండి భక్తులను దర్శనాలు, ఆర్జిత అభిషేకాలు, ఇతర ఆర్జితసేవలు అనుమతిస్తామన్నారు. చంద్రగ్రహణం రోజైన 28న మధ్యాహ్నం 3,30ల వరకు మాత్రమే భక్తులకు సర్వదర్శనం అనుమతిస్తామని అలానే 28 న మధ్యాహ్నం 12.30 వరకు మాత్రమే గర్భాలయ ఆర్జిత అభిషేకాలకు అవకాశం కల్పిస్తూ సామూహిక అభిషేకాలు,స్పర్శ దర్శనాలు (సర్వ కాదు)కూడా ఉదయం మాత్రమే ఉంటుంది.

Tirumala temple will remain closed on the night of October 28 due to partial Lunar eclipse

సాయంత్రం 6:30 గంటలకు ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ వైదిక కమిటీ తెలిపింది. గ్రహణం విడిచిన తర్వాత అనగా ఈ నెల 29న తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సంప్రోక్షణ తర్వాత 29న ఉదయం 9 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+