తిరుపతికి విమానాల రాకపోకల షెడ్యూల్ మార్పు, కొత్త టైమింగ్స్..!!

తిరుపతికి వచ్చే విమాన ప్రయాణీకులకు బిగ్ అలర్ట్. తిరుపతికి రాకపోకలు సాగించే విమానాల షెడ్యూల్ లో మార్పులు చేసారు. కొత్త వేళలు ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నాయి. విమానయాన సంస్థలు ఈ షెడ్యూల్ ఖరారు చేసాయి. నిత్యం వేలాది మంది ప్రయాణీకులు విమానాల ద్వారా తిరుపతికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కాగా, ప్రయాణీకుల నుంచి వస్తున్న ఆదరణ.. అభ్యర్ధన లకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

తిరుపతి విమానాశ్రయం నుంచి నడిచే పలు విమాన సర్వీసుల వేళల్లో మార్పులు చేశారు. ఈ మేరకు విమానాశ్రయం అధికారులు వెల్లడించారు. ఇవి ఈ రోజు (సెప్టెంబర్ 1) నుంచి అమలు లోకి వస్తాయని తెలిపారు. అందులో భాగంగా హైదరాబాద్ - తిరుపతి: ఉదయం 7:20కి వచ్చి, తిరిగి 8:00 గంటలకు బయలుదేరుతుంది. ​హైదరాబాద్ - తిరుపతి: ఉదయం 11:15కి వచ్చి, తిరిగి 11:45 గంటలకు బయలుదేరుతుందని వెల్లడించారు. ​హైదరాబాద్ - తిరుపతి: మధ్యాహ్నం 1:50కి వచ్చి, తిరిగి 2:30 గంటలకు బయలుదేరనుంది. ఇక, ​విశాఖపట్నం - తిరుపతి: మధ్యాహ్నం 3:30కి వచ్చి, తిరిగి సాయంత్రం 4:00 గంటలకు బయలుదేరుతుందని.. కాగా, ​ఢిల్లీ - తిరుపతి: సాయంత్రం 6:25కి వచ్చి, తిరిగి రాత్రి 7:05 గంటలకు బయలుదేరు తుందని అధికారులు వెల్లడించారు. ​హైదరాబాద్ - తిరుపతి: రాత్రి 8:20కి వచ్చి, తిరిగి రాత్రి 9:00 గంటలకు బయలుదేరేలా మార్పు చేసారు.

 శ్రీవారి సేవలో కొత్తగా వీరికీ TTD భాగస్వామ్యం - అర్హతలు, నమోదు ప్రక్రియ..!!
శ్రీవారి సేవలో కొత్తగా వీరికీ TTD భాగస్వామ్యం - అర్హతలు, నమోదు ప్రక్రియ..!!
tirupati-airport-flight-schedules-revised-changes-effective-from-september-1-here-the-details

విమానాల రాకపోకల కొత్త షెడ్యూల్

అదే విధంగా స్టార్ ఎయిర్‌లైన్స్ సర్వీస్ కు చెందిన ​శివమొగ్గ - తిరుపతి: మధ్యాహ్నం 12:20కి వచ్చి, తిరిగి సాయంత్రం 6:00 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతుంది.​ ఇక.. ఎయిర్ ఇండియా సర్వీస్ కు చెందిన ​హైదరాబాద్ - తిరుపతి సర్వీసు: సాయంత్రం 5:10కి వచ్చి, తిరిగి సాయంత్రం 6:00 గంటలకు బయలుదేరేలా మార్పులు ప్రకటించారు. ఇక.. ఇప్పటికే విదేశాల నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం రేణిగుంట విమానాశ్రయంలో ఈ వీసా సేవలు ప్రారంభించారు. గతంలో విదేశీ యాత్రికులు చెన్నై లేదా బెంగళూరు విమానాశ్రయాలకు చేరుకుని అక్కడి నుంచి తిరుపతికి వచ్చే వారు. దీనివల్ల ప్రయాణ సమయం చాలా ఎక్కువగా ఖర్చయ్యేది. ఈ నూతన విధానం ద్వారా భక్తులు నేరుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకోవడానికి మార్గం సులభం అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+