ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గనకు తీవ్ర అవమానం-రేణిగుంట ఎయిర్‌పోర్టులోకి నో ఎంట్రీ
ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు సొంత గడ్డపై తీవ్ర అవమానం ఎదురైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చోటు చోసుకున్న ఓ ఘటనతో ఆయనకు భారీ షాక్ తప్పలేదు. తిరుపతి ఎయిర్‌పోర్టులో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు వీడ్కోలు పలికేందుకు ఆయన వచ్చిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
రెండు రోజుల క్రితం రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్వాగతం పలికారు. పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లేందుకు గోయల్ తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అదే సమయంలో బుగ్గన కూడా అక్కడికి వచ్చారు. కానీ ఆయనకు ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ లభించలేదు. కేంద్రమంత్రికి రాష్ట్రమంత్రి హోదాలో వీడ్కోలు పలికేందుకు వచ్చానని చెప్పినా విమానాశ్రయ అధికారులు అంగీకరించలేదు.

తిరుపతి విమానాశ్రయంలోకి కేంద్రమంత్రి చేరుకుని విమానం ఎక్కేందుకు వెళ్తున్న సమయంలో వీఐపీ ఎంట్రీ నుంచి లోపలోకి వెళ్లేందుకు ఆర్ధిక మంత్రి బుగ్గన ప్రయత్నించారు. కానీ ఆయన్ను అడ్డుకున్న భద్రతా సిబ్బంది ప్రోటోకాల్ ప్రకారం అనుమతి లేదని చెప్పేశారు. దీంతో బుగ్గన ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆయన్ను భద్రతా సిబ్బంది వెనక్కి నెట్టేశారు. దీంతో ఆయన దాదాపు కింద పడబోయారు. అంతలోనే తేరుకున్న బుగ్గన... తనను అడ్డుకున్న విమానాశ్రయ సిబ్బంది వివరాలు ఇవ్వాలని అధికారుల్ని కోరారు. కానీ వారు బుగ్గనను సర్దిచెప్పి పంపించేశారు. ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతోంది. మంత్రి హోదాలో ఉన్న బుగ్గన విషయంలో ఎయిర్‌పోర్టు అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications