Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tirupati: అలిపిరిలో సప్తగోప్రదక్షిణ మందిరం ప్రారంభించిన సీఎం జగన్, కాలినడక భక్తుల కోసం !

తిరుమల/ తిరుపతి: తిరుప‌తిలోని అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద నిర్మించిన శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని సోమ‌వారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. తిరుప‌తిలోని అలిపిరి నుండి తిరుమ‌ల జిఎన్‌సి టోల్ గేట్ వ‌ర‌కు పున‌ర్నిర్మించిన న‌డ‌క‌మార్గం పైక‌ప్పును ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. ముందుగా అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద‌కు చేరుకున్న ముఖ్య‌మంత్రి జగన్ కు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి క‌లిసి పుష్ప‌గుచ్ఛాలు అందించి స్వాగ‌తం ప‌లికారు.

మొదట గోమాత.... తరువాత శ్రీవారి దర్శనం

మొదట గోమాత.... తరువాత శ్రీవారి దర్శనం


తిరుమల తిరుపతి దేవస్థానములు గోసంరక్షణకుపెద్దపీట వేస్తూ గోవిందుని, గోవు విశిష్టతను తెలియజేస్తూ భక్తులు ముందుగా సకలదేవతా స్వరూపిణిగా భావిస్తున్న గోమాతను దర్శించుకుని, తరువాత శ్రీవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో అలిపిరి శ్రీవారి పాదాల చెంత చెన్నైకి చెందిన దాత అందించిన రూ.15 కోట్ల విరాళంతో శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని టీటీడీ నిర్మించింది.

ఏడు కొండలకు సూచికగా ఏడు గోవులు, ఏడు దూడలు

ఏడు కొండలకు సూచికగా ఏడు గోవులు, ఏడు దూడలు

తిరుమలకు నడకదారిలోనూ, వాహనాల్లోనూ వెళ్లే భక్తులకు అనువుగా ఉండే చోట ఈ మందిరం నిర్మించడం జరిగింది.

ప్రాముఖ్యతలు

ఏడు కొండలకు సూచికగా ఏడు గోవులు, వాటి దూడల నడుమ శ్రీవేణుగోపాలస్వామి విగ్రహం, గోదర్శనం, గోపూజ, ప్రత్యేకంగా గ్రహశాంతి నివారణ పూజలు నిర్వహించుకునేందుకు వీలుగా శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిరం ఏర్పాటు చేయడమైనది.

గో తులాభారం

గో తులాభారం

భక్తులు వారు ఎంపిక చేసుకున్న గోవు బరువును బట్టి ద్రవ్యములు గానీ, గ్రాసం గానీ తులాభారం ద్వారా దానంగా సమర్పించే అవకాశం కల్పించడం జరిగింది. కనుమరుగవుతున్న భారతీయ స్వదేశీ గోజాతులు, వాటి ఔన్నత్యాన్ని దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా తెలియజేసే విధంగా గోవిజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారు. పూజకు సంబంధించిన వివిధ జాతుల గోవులను గోసదన్‌లో ఉంచి వాటి ఆలనాపాలనా చూసేందుకు వీలుగా గోసదన్ నిర్మించారు.

సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం

సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం

తిరుప‌తిలోని అలిపిరి నుండి తిరుమ‌ల జిఎన్‌సి టోల్ గేట్ వ‌ర‌కు పున‌ర్నిర్మించిన న‌డ‌క‌మార్గం పైక‌ప్పును సోమ‌వారం ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. అలిపిరి నుంచి తిరుమలకు నడచివెళ్లే మార్గంలో 40 సంవత్సరాల క్రితం పైకప్పు నిర్మించారు. ఈ పైకప్పు అక్కడక్కడా పాడై పునరుద్ధరణ అవసరమైంది.

 కాలినడక భక్తుల కోసం రూ. 25 కోట్లతో నిర్మాణం

కాలినడక భక్తుల కోసం రూ. 25 కోట్లతో నిర్మాణం


ఈ పరిస్థితుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.25 కోట్ల విరాళంతో నడకమార్గంలో నూతనంగా పైకప్పు నిర్మించడానికి ముందుకొచ్చింది. అలిపిరి నుండి గాలిగోపురం వరకు 1,100 మీటర్ల దూరం కొత్తగా గాల్‌వాల్యూమ్‌ రూఫింగ్‌ షెల్టర్లు నిర్మించారు. గాలిగోపురం నుంచి తిరుమల జిఎన్‌సి వరకు 3,250 మీటర్ల దూరం కొత్తగా ఆర్‌సిసి రూఫ్‌ షెడ్లు ఏర్పాటు చేశారు.

Recommended Video

    Hindu communities are going on a Temple Liberation Maha Padayatra to protect Hindu temples
    తరలి వచ్చిన నాయకులు, అధికారులు

    తరలి వచ్చిన నాయకులు, అధికారులు


    ముఖ్యమంత్రి సీఎం జగన్ పాల్లొన్న ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఉపసభాపతి కోన రఘుపతి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎంపీలు గురుమూర్తి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, అదనపు ఈఓ ఏవి.ధర్మారెడ్డి, తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి, రిలయన్స్ సంస్థ ప్రతినిధులు ఎం.సచిన్, ఏవీఎస్ఎస్.రావు తదితరులు పాల్గొన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+