Gold Smith: స్వర్ణకారులకు స్వర్ణయుగం, ఏపీ ప్రభుత్వం శిక్షణ, బీసీల కోసమే !
తిరుపతి/మదనపల్లె: ప్రభుత్వం ఆధ్యర్యంలో బీసీ కులాల్లోని చేతి వృత్తుల వారికి నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. శుభకార్యాలు, వివాహ శుభకార్యాలుతో పాటు తమ స్థాయికి తగ్గట్లు బంగారు నగలు చేయించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. అలాంటి స్వర్ణకారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చక్కటి అవకాశం కల్పిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని నియోజక వర్గాల్లో స్వర్ణకార సంఘాలకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారిని మరింత ప్రోత్సహించడానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో శ్రీ వీర భంహ్మేంద్రస్వామి ఆలయంలో నవయుగ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో స్వర్ణకారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, బీసీ సంక్షేమ శాఖ సీనియర్ అధికారులు హాజరై ప్రభుత్వ పథకాలు ఎలా సధ్వినియోగం చేసుకోవాలి, ప్రభుత్వ పథకాలను ఎలా ఉపయోగించుకోవాలి, రుణాలు ఎలా పొందాలి, చక్కటి నైపుణ్యంతో ఎలా చూడచక్కటి అందమైన బంగారు నగలు తయారు చెయ్యాలి అంటూ ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు.

ఏప్రిల్ 31వ తేదీ వరకు ప్రభుత్వ ఆధ్యర్వంలో బీసీ కులాలకు చెందిన వారికి ప్రత్యేక శిక్షణా తరగతలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు విజయవంతం చెయ్యాలని నవయుగ స్వర్ణకారుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఏ. భాస్కర ఆచారి, అధ్యక్షుడు టి. కిరణ్, ఉపాధ్యక్షుడు రేవంత్, సెక్రటరి రవి, రచయితల సంఘం కార్యదర్శి యుగంధరాచారి, ప్రభుత్వ ఉద్యోగులు టి. మౌనిష్, కమురుద్దీన్, కౌసర్, రఘు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోనే మదనపల్లె డివిజన్ అతి పెద్ద డివిజన్ అనే విషయం తెలిసిందే. మదనపల్లెలో సబ్ కలెక్టర్ కార్యాలయం కూడా ఉండటంతో ఇక్కడ బీసీల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications