తిరుపతి పోరు .. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి పోటీకి అనర్హుడు, సిఈసీకి ఏపీ బీజేపీ నేతల ఫిర్యాదు
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ గురుమూర్తి పోటీకి అనర్హుడు అంటూ ఏపీ బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన గురుమూర్తి తిరుపతి నగరంలో పోటీకి అనర్హుడు అంటూ ,అందుకు తగిన ఆధారాలను ఎన్నికల సంఘానికి సమర్పించామని ఏపీ బీజేపీ నేతలు చెప్తున్నారు.
వర్చువల్ విధానంలో ఏపీ బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల కమిషనర్ కు తమ ఫిర్యాదును నివేదించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ భద్రత, తదితర అంశాలపై ఆందోళన వ్యక్తం చేసిన బిజెపి నేతలు వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, వాలంటీర్లను రాజకీయలబ్ధి కోసం వినియోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి విషయంలో కూడా ఫిర్యాదు చేసినట్లుగా వెల్లడించారు.

గురుమూర్తి అన్య మతానికి చెందిన వ్యక్తి అని, అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని, వాటిని కేంద్ర ఎన్నికల కమిషన్ కు అందజేశామని , గురుమూర్తి అనర్హత అంశంపై విచారణ జరపాలని కోరామని జివీఎల్ తెలిపారు. ఎస్సీలు మతం మారితే రిజర్వేషన్ వర్తించదని కావున ఎస్సీలకు రిజర్వ్ అయిన పార్లమెంటు స్థానానికి పోటీ చేయడానికి డాక్టర్ గురుమూర్తి అనర్హుడు అంటూ పేర్కొన్నారు. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరామని పేర్కొన్న బిజెపి నేతలు తిరుపతిలో ఈనెల 17వ తేదీన జరిగే ఉప ఎన్నికల పోలింగ్ విషయంలో అధికారి వైసీపీపై పలు ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు.
Recommended Video
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications