టీటీడీ కీలక నిర్ణయం: తిరుమల లడ్డు ధర పెంపు (ఫోటోలు)
తిరుపతి: శ్రీవారి ప్రసాదాల్లో భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డు ధరను పెంచాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన పాలకమండలి సమావేశం చేసిన తీర్మానాలను చైర్మన్, కార్యనిర్వహణాధికారి (ఈవో) సాంబశివరావు మీడియాకు వెల్లడించారు.
స్వామివారి అర్జిత సేవల రుసుములతో సహా గదుల, కల్యాణమంటపాల అద్దెలు కూడా పెంచాలని నిశ్చయించింది.
ఈ మేరకు పి.సుధాకర్‌యాదవ్, సండ్ర వెంకటవీరయ్య, సాయన్న, శేఖర్, డీపీ అనంత, రాఘవేంద్రరావు, భానుప్రకాష్‌రెడ్డి, జేఈవోలు శ్రీనివాసరాజు, భాస్కర్, ఎఫ్‌ఏసీఏవో బాలాజీలతో ఓ కమిటీని టీటీడీ ఏర్పాటు చేసింది.

తిరుమల లడ్డు ధర పెంపు
అన్ని అంశాలపై అధ్యయనం చేసి, పదిహేను రోజుల్లో తగిన ప్రతిపాదనలతో నివేదిక ఇవ్వాలని టీటీడీ బోర్డు కోరింది.

తిరుమల లడ్డు ధర పెంపు
దీంతో పాటు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో 3.5 ఎకరాల్లో రూ.13.98 కోట్లతో శ్రీవారు, శ్రీమహాగణపతి ఆలయాలు నిర్మిస్తారు.

తిరుమల లడ్డు ధర పెంపు
తిరుమలలో కొత్తగా నిర్మించిన గోవిందసాయి విశ్రాంతి భవనం మాస్టర్ సూట్‌కు రూ.6వేలు, సాధారణ సూట్‌కు రూ.2,500, గ్రౌండ్‌ఫ్లోర్ (సెల్లార్)లో రూ.750 చొప్పున అద్దె వసూలు చేస్తారు.

తిరుమల లడ్డు ధర పెంపు
తమిళనాడులోని అరవింద నేత్ర వైద్యశాల శాఖ ఏర్పాటు కోసం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వద్ద ఎకరాకు ఏటా రూ. లక్ష లీజుతో ఏడెకరాలను కేటాయిస్తారు.

తిరుమల లడ్డు ధర పెంపు
ఎస్వీ భక్తి చానల్ ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎందుకు పాటించలేదని బోర్డు సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య ఈ సమావేశంలో ప్రశ్నించారు.

తిరుమల లడ్డు ధర పెంపు
ఖమ్మంలోని టీటీడీ సమాచార కేంద్రంలో కడపకు చెందిన వ్యక్తి పనిచేయడం ఏంటని, స్థానికులకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. దీనిపై వారంలోగా నివేదిక ఇవ్వాలని కోరారు.
-
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications