సుగుణమ్మకి చంద్రబాబు సూచనలు (ఫోటోలు)
హైదరాబాద్: తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి ఉపఎన్నికలో తనకు టిక్కెట్ ఇచ్చి ఘన విజయం దక్కేందుకు తోడ్పడినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తిరుపతి నియోజక వర్గం అభివృద్ధికి సుగుణమ్మ కృషి చేయాలని కోరారు. తిరుపతిని స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. బడుగు బలహీన వర్గాలతో ఆమె భర్త, దివంగత నేత వెంకటరమణ ఏ విధంగా మమేకం అయ్యేవారో అదే విధంగా నిరంతరం ప్రజా సంబంధాలు కలిగి ఉండాలని కోరారు.
తిరుపతి అభివృద్ధికి ప్రభుత్వ పరంగా తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. సుగుణమ్మ వెంట వచ్చినవారిలో గాలి ముద్దుకృష్ణమనాయుడు, రాజంపేట మాజీ ఎంపీ గునిపాటి రామయ్య తదితరులు ఉన్నారు.

సీఎం బాబుని ఇంట్లో కలిసిన సుగుణమ్మ
తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎం బాబుని ఇంట్లో కలిసిన సుగుణమ్మ
తిరుపతి ఉపఎన్నికలో తనకు టిక్కెట్ ఇచ్చి ఘన విజయం దక్కేందుకు తోడ్పడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తిరుపతి నియోజక వర్గం అభివృద్ధికి సుగుణమ్మ కృషి చేయాలని కోరారు.

సీఎం బాబుని ఇంట్లో కలిసిన సుగుణమ్మ
తిరుపతిని స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. బడుగు బలహీన వర్గాలతో ఆమె భర్త, దివంగత నేత వెంకటరమణ ఏ విధంగా మమేకం అయ్యేవారో అదే విధంగా నిరంతరం ప్రజా సంబంధాలు కలిగి ఉండాలని కోరారు.

పీలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీనాథ్ రెడ్డి సీఎం చంద్రబాబుతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చిత్తూరు జిల్లా పీలేరు నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీనాథ్ రెడ్డి మంగళవారం సీఎం నివాస గృహంలో కలిశారు.

పీలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీనాథ్ రెడ్డి సీఎం చంద్రబాబుతో భేటీ
ఈ సందర్భంగా తాను తెలుగుదేశం పార్టీలో చేరడానికి సంసిద్ధతంగా ఉన్నట్లు వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications