Tirupati Nagarjuna sagar ఉపఎన్నిక: ముగిసన పోలింగ్... తిరుపతిలో భారీగా తగ్గిన పోలింగ్ శాతం
అటు బెంగాల్‌లో ఐదవ విడత పోలింగ్ జరుగుతుండగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సందడి కనిపిస్తోంది. మొన్నటి వరకు ప్రచారాలతో హోరెత్తించిన అభ్యర్థులు ఇక తమ అదృష్టం ఎలాగుందో పరీక్షించుకుంటున్నారు. ఏపీలో తిరుపతి పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గారావు మృతితో అక్కడ ఉపఎన్నిక అనివార్యం కాగా... తెలంగాణలోని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్శింహయ్య మృతితో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగే ఉపఎన్నిక బరిలో వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ, టీడీపీ నుంచి మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మీ ఉన్నారు.

తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉపఎన్నిక బరిలో టీఆర్ఎస్ నుంచి నోముల భగత్ బరిలో ఉండగా, బీజేపీ నుంచి డాక్టర్ రవికుమార్, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి బరిలో ఉన్నారు. అటు తిరుపతిలో ఇటు నాగార్జున సాగర్‌లో ప్రచారం వాడీవేడీగా సాగింది. ఇక ఓటర్ల చేతిలో అభ్యర్థుల భవితవ్యం ఉంది. తిరుపతి పార్లమెంట్ మరియు నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నికపై మినిట్-టూ- మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం













Click it and Unblock the Notifications