చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Tirupati: కాణిపాకం వినాయకుడికి పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్, బంగారు రథం !

|
Google Oneindia TeluguNews

కాణిపాకం/తిరుపతి: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు టీటీడీ తరపున శనివారం పట్టువస్త్రాలు సమర్పించారు.
కాణిపాకం అతిథి గృహం వద్దకు చేరుకున్న శ్రీ సుబ్బారెడ్డి కి డిప్యూటీ సిఎం శ్రీ నారాయణ స్వామి, శాసన సభ్యులు
శ్రీ ఎం ఎస్ బాబు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ శ్రీ విజయానంద రెడ్డి, కాణిపాకం ఆలయ ఈవో శ్రీ వెంకటేసు స్వాగతం పలికారు.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి టీటీడీ ఆధ్వర్యంలో తయారు చేయించిన బంగారు రథాన్ని చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీ వినాయక స్వామి వారికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషకరమని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

TTD: ఏకాంతంగా తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు, కరోనా దెబ్బతో భక్తులకు అవకాశం లేదు, వైవీ సుబ్బారెడ్డి !TTD: ఏకాంతంగా తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు, కరోనా దెబ్బతో భక్తులకు అవకాశం లేదు, వైవీ సుబ్బారెడ్డి !

టీటీడీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి దంపతులు

టీటీడీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి దంపతులు


కాణిపాకం ఆలయ అర్చకులు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తో పాటు డిప్యూటి సిఎం, ఎమ్మెల్యే, ఆర్టీసీ రీజనల్ చైర్మన్, ఆలయ ఈవో కు సాంప్రదాయ బద్దంగా పరివట్టం కట్టి తలమీద పట్టు వస్త్రాలు, పూలమాలలు ఉంచారు. అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య వీరు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని శ్రీ వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు.

వేద ఆశీర్వచనం

వేద ఆశీర్వచనం

అనంతరం ఆలయ అర్చకులు అతిథులకు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో
శ్రీ వెంకటేసు టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డి దంపతులతో పాటు మిగిలిన అతిథులకు స్వామి వారి ప్రసాదాలు, చిత్రపటం అందించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి టీటీడీ ఆధ్వర్యంలో తయారు చేయించిన బంగారు రథాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు.

స్వామివారి బంగారు రథం

స్వామివారి బంగారు రథం

అనంతరం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, శ్రీ వినాయక స్వామి వారికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషకరమన్నారు. కాణిపాకం ఆలయం బంగారు రథం నిర్మాణానికి టీటీడీ కి రూ 6 కోట్లు చెల్లించిందని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ప్రభుత్వ అనుమతితో టీటీడీ తన వద్ద ఉన్న బంగారం ఉపయోగించి రథం నిర్మాణం పూర్తి చేసిందని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.

కొవిడ్ నియమాలు పాటించాలని మనవి

కొవిడ్ నియమాలు పాటించాలని మనవి

కోవిడ్ కారణంగా రథం నిర్మాణం పనులు ఆలస్యం అయ్యాయని టీటీడీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా వైరస్ నుంచి ప్రపంచం పూర్తిగా బయట పడాలని స్వామి వారిని ప్రార్థించినట్లు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ఇందులో భాగంగానే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ సారి కూడా ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. వారం, పది రోజుల్లో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు పాలక మండళ్ళు నియమించే అవకాశం ఉందని మీడియా అడిగిన ప్రశ్నకు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సమాధానం ఇచ్చారు. న్యాయ పరమైన ఇబ్బందుల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోందని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఈ సందర్బంగా టీటీడీ
ఈఈ శివరామ కృష్ణ, ఎఈవో మురళి, స్ధపతి మునిస్వామి రెడ్డి, కాణిపాకం ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

English summary
Tirupati: Tirumala Tirupati Devasthanams chairman YV Subba Reddy presented Pattu Vastrams to Lord Ganesha at the Varasiddhi Vinayaka Swamy temple at Kanipakam in Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X