Tirupati: ఎయిర్ పోర్టులో తిరుమల శ్రీవారి దర్శనం టిక్కెట్ కౌంటర్, ఫస్ట్ టైమ్, భక్తుల కోసమే, టీటీడీ !

తిరుమల/తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లు గురువారం నుంచి తిరుపతి ఎయిర్ పోర్టు ( రేణిగుంట ఎయిర్ పోర్టు ) లోనే మంజూరు చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుపతి ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్ ను టీటీడీ జేఈవో వీరబ్రహ్మం గురువారం శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రారంభించారు.
దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో విమానంలో ప్రయాణించి తిరుపతి చేరుకుని తరువాత తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తున్న విషయ తెలిసిందే.

తిరుపతి ఎయిర్ పోర్టులో కౌంటర్

తిరుపతి ఎయిర్ పోర్టులో కౌంటర్

ఎయిర్ పోర్టులో శ్రీవాణి ట్రస్ట్ కౌంటర్ ప్రారంభించిన తరువాత టీటీడీ జేఇవో వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ, శ్రీవాణి ట్రస్టుకు రూ 10 వేలు విరాళం ఇచ్చి టికెట్ కోసం రూ. 500 చెల్లించే భక్తులకు తిరుమలలో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేసేవారని చెప్పారు. దేశ విదేశాల నుండి శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిరుపతి ఎయిర్ పోర్టులో శ్రీవాణి టికెట్లు జారీ చేయనున్నట్లు టీటీడీ జేఇవో వీరబ్రహ్మం తెలిపారు.

మాదవరం గెస్ట్ హౌస్

మాదవరం గెస్ట్ హౌస్

ఇప్పటికే తిరుపతిలోని తిరుపతిలోని మాధవం గెస్ట్ హౌస్ లో శ్రీ వాణి ట్రస్ట్ టికెట్ల కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు టీటీడీ జేఇవో వీరబ్రహ్మం తెలిపారు. ఎయిర్ పోర్టులో తిరుపతిలోని మాధవం గెస్ట్ హౌస్ లో శ్రీ వాణి టికెట్ల కౌంటర్లు ఏర్పాటు చేయడం వల్ల దాతలు ముందు రోజు తిరుమలకు వెళ్ళి అవసరమైన పత్రాలు సమర్పించి టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఇక ముందు ఉండదని టీటీడీ జేఇవో వీరబ్రహ్మాం అన్నారు.

శ్రీవారు అందరివాడు.... అందుకే ఇక్కడ ఏర్పాట్లు

శ్రీవారు అందరివాడు.... అందుకే ఇక్కడ ఏర్పాట్లు

ఈ ప్రక్రియలో దాతలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు గుర్తించి టీటీడీ యాజమాన్యం శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు తిరుపతిలోనే జారీ చేసి మాధవంలో వారికి వసతి కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ జేఇవో వీరబ్రహ్మాం చెప్పారు. దీనివల్ల భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని టీటీడీ జేఇవో వీరబ్రహ్మాం చెప్పారు.

శ్రీవారి భక్తులకు మనవి

శ్రీవారి భక్తులకు మనవి

తిరుపతి ఎయిర్ పోర్టు లో ఏర్పాటు చేసిన కౌంటర్లను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ జేఇవో వీరబ్రహ్మాం మనవి చేశారు. తిరుపతి ఎయిర్ పోర్టులో తిరుమల శ్రీవాణి ట్రస్టుకు సంబంధించిన ఈ కౌంటర్ల నిర్వహణకు ముందుకొచ్చిన హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు యాజమాన్యానికి టీటీడీ జేఈవో వీరబ్రహ్మం కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+