అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీలోకి కొత్త 'వారసుడొచ్చాడు!'

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రానున్న ఎన్నికలు గట్టి సవాల్ ను విసరబోతున్నాయి. అంతేకాదు ఆయన రాజకీయ చతురతకు, వ్యూహాలకు కఠిన పరీక్ష ఎదురుకాబోతోంది. భారతీయ జనతాపార్టీ 2029 ఎన్నికలు టార్గెట్ గా ఏపీని ఎంచుకుంది. మరోవైపు కేసీఆర్ జాతీయపార్టీ పేరుతో ఏపీలో తిష్టవేయడానికి ప్రయత్నాలను ప్రారంభించారు. 2024 ఎన్నికల్లో గెలుపొందితేనే 2029 ఎన్నికల్లో గట్టిగా నిలబడటానికి అవకాశం దొరుకుతుంది.

40 శాతం యువతకే కేటాయించబోతున్న బాబు!

40 శాతం యువతకే కేటాయించబోతున్న బాబు!

ముఖ్యమంత్రి జగన్ తాను ఎటువంటి ప్రయోగాలు చేయదలుచుకోలేదని, వారసులెవరికీ చోటులేదని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం 40 శాతం యువతే ఉంటుందని ప్రకటించారు. వచ్చే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సమాయత్తపరిచేందుకు నారా లోకేష్ జనవరి 26వ తేదీ నుంచి పాదయాత్ర చేయబోతున్నారు. లోకేష్ కు, సీనియర్ నేతల మధ్య కెమిస్ట్రీ కుదరకపోతుండటంతో ఆయన సమకాలికులను రంగంలోకి దించాలని బాబు నిర్ణయించారు. అందులో భాగంగానే వరుసగా మూడుసార్లు పోటీచేసి ఓటమిపాలైన నేతలకు సీట్లు లేవని ఒంగోలు లో జరిగిన మహానాడులో బహిరంగంగానే ప్రకటించారు.

సీనియర్ నేతలకు బదులుగా వారి వారసులు..!

సీనియర్ నేతలకు బదులుగా వారి వారసులు..!

సీనియర్ నేతలకు బదులుగా వారి వారసులను రంగంలోకి దించబోతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీ వారసులు విస్త్రతంగా పర్యటిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కొవూరు నియోజకవర్గ టీడీపీ నేత పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తనయుడు దినేష్ రెడ్డికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొత్త బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ఎదుర్కోబోయేది దినేష్ రెడ్డి అని ఖరారైంది.

 నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న దినేష్ రెడ్డి

నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న దినేష్ రెడ్డి


2014 ఎన్నికల్లో పొలంరెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై విజయం కైవసం చేసుకున్నారు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి ప్రసన్న కుమార్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన రాజకీయాల్లో చురుగ్గా తిరగడం తగ్గించారు. నియోజకవర్గంలో తమకు దిశా నిర్దేశం చేసే నేత లేకపోయేసరికి క్యాడర్ అయోమయానికి గురైంది. ఈ క్రమంలో చంద్రబాబు దినేష్ రెడ్డి పేరు ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. రానున్న ఎన్నికల్లో సీటు ఖరారు కావడంతో దినేష్ శరవేగంగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. యువనాయకుడికి పదవి దక్కడంతో టీడీపీ శ్రేణులు ఉత్సహంగా కదులుతున్నాయి. ఈ కొత్త వారసుడు కోవూరులో సత్తా చాటుతాడా? లేదా? అనే ఉత్కంఠ రాజకీయవర్గాల్లో నెలకొంది.

English summary
Telugu Desam Party chief Nara Chandrababu Naidu is going to throw a tough challenge in the upcoming elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X