ఏపీని అప్పులపాలు చేసిన కూటమి
Chandrababu Naidu: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై విమర్శల సునామీ తగ్గట్లేదు. ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా దీన్ని అంత సులభంగా వదిలేలా కనిపించట్లేదు. లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులపై 18 శాతం జీఎస్టీని ఎత్తివేయాలంటూ లోక్‌సభలో ఆవరణలో ఇదివరకే ధర్నాకు దిగారు కూటమి నాయకులు. దీన్ని మరింత ఉధృతం చేయనున్నారు.
అదే సమయంలో- లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలు మహువా మొయిత్రా కేంద్ర ప్రభుత్వం ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. వేతన జీవులు, మధ్యతరగతి వర్గాల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాదంటూ నిప్పులు చెరిగారు. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా రూపొందించారంటూ మండిపడ్డారు.

ఫైనాన్స్ బిల్లుపై తోటి ఎంపీ అమర్‌సింగ్‌తో కలిసి ఆమె మాట్లాడారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, సంపన్నులను కాపాడేలా, కార్పొరేట్ సెక్టార్‌కు వెన్నుదన్నుగా బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. వ్యక్తులపై పన్ను మొత్తం 19 శాతం కాగా కార్పొరేట్ పన్ను మొత్తం 17 శాతంగా ఉందని అన్నారు.
వ్యక్తిగత పన్నును పెంచుతూ, కార్పొరేట్ పన్ను శాతాన్ని ఎందుకు తగ్గిస్తోన్నారంటూ నిలదీశారు. ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తోందంటూ ప్రశ్నించారు. అతను అడిగాడు. భారతదేశంలోని ఒక శాతం ధనవంతుల వద్ద 40 శాతం సంపద ఉందని ప్రపంచ అసమానత నివేదిక వెల్లడించిందని, ప్రభుత్వం అధిక ఆదాయ వర్గాలకు లబ్ధి చేకూరుస్తోందని ఆరోపించారు.
ఈ బడ్జెట్ ద్వారా నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన దేశ ప్రజలను అవహేళన చేశారంటూ మహువా మొయిత్రా ధ్వజమెత్తారు. సామాన్య ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజలు ఆకాంక్షలకు పూర్తి భిన్నంగా బడ్జెట్‌ను రూపొందించారని, బడ్జెట్‌లో కాదు కదా కనీసం సంబంధిత శాఖ మంత్రిని కూడా మార్చలేదంటూ ఎద్దేవా చేశారు.
దేశ జనాభాలో 31 శాతం మంది మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారని, 60-65 శాతం పేదలు ఉన్నారని గుర్తు చేశారు. వారికోసం కాకుండా కార్పొరేట్ శక్తుల కోసం బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు కనిపిస్తోందని మహువా మొయిత్రా చెప్పారు. పన్నుల వ్యవస్థలో సమతుల్యత లోపించిందని వివరించారు.
ఏపీకి కేటాయించిన 15,000 కోట్ల రూపాయల మొత్తం అప్పేనని మహువా మొయిత్రా తేల్చి చెప్పారు. దీనికి రుణాన్ని చెల్లించాల్సిన భారం ఏపీ ప్రజలపైనే ఉందని పేర్కొన్నారు. ఒక్క రూపాయి కూడా గ్రాంట్‌గా ఇవ్వలేదని స్పష్టం చేశారు. వివిధ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఆ మొత్తాన్ని రుణంగా పొందేలా మాత్రమే సహకరిస్తామని బడ్జెట్‌లో పొందుపర్చారని అన్నారు.
వెనుకబడిన జిల్లాలైన రాయలసీమ, ప్రకాశం, ఉత్తర-కోస్తాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి గ్రాంట్ ఇస్తామని ప్రతిపాదించడాన్ని స్వీపింగ్ స్టేట్‌మెంట్‌గా అభివర్ణించారు మహువా మొయిత్రా. ఇందులో కూడా అబద్ధాలే ఉన్నాయని, ఏపీకి ఒక్క రూపాయి కూడా గ్రాంట్‌గా ఇవ్వలేదని తేల్చి చెప్పారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications