వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పళనిస్వామి కేబినెట్లో తొలిసారి గెలిచిన తెలుగోడికి ఛాన్స్

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పళనిస్వామి కేబినెట్లో తెలుగు వ్యక్తికి మంత్రి పదవి లభించింది. ఆయనే హోసూరు ఎమ్మెల్యే బాలకృష్ణా రెడ్డి. ఈయనకు పశుసంవర్ధక శాఖను అప్పగించారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పళనిస్వామి కేబినెట్లో తెలుగు వ్యక్తికి మంత్రి పదవి లభించింది. ఆయనే హోసూరు ఎమ్మెల్యే బాలకృష్ణా రెడ్డి. ఈయనకు పశుసంవర్ధక శాఖను అప్పగించారు.

హోసూరులో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉంటారు. దీంతో అక్కడ బాలకృష్ణా రెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. జయలలిత కేబినెట్లో దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. బాలకృష్ణా రెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చారు. పళనిస్వామి తన కేబినెట్లో కొత్తగా ఆరుగురికి అవకాశమిచ్చారు.

<strong>పన్నీరు కంటే స్ట్రాంగ్‌గా పళనిస్వామి: సీఎంగా ప్రమాణం, మంత్రులు వీరే..</strong>పన్నీరు కంటే స్ట్రాంగ్‌గా పళనిస్వామి: సీఎంగా ప్రమాణం, మంత్రులు వీరే..

TN cabinet sworn in with Edapaddi Palanisami as CM, Telugu man in cabinet

ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన పళనిస్వామి కూడా రైతు కుటుంబం నుంచి వచ్చారు. సేలం జిల్లాలోని ఎడప్పాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పళని స్వామి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పళని వయసు 63 సంవత్సరాలు.

బీఎస్సీవరకు చదువుకున్నారు. రైతు కుటుంబ నుంచి వచ్చిన పళని ఇప్పటివరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సదీర్ఘ రాజకీయ అనుభవం గడించిన పళని గౌండర్ కులానికి చెందిన వ్యక్తి. పార్టీకి మంచి విశ్వాసపాత్రుడుగా ఉన్న పళనిస్వామి అనేక కీలక పదవులు చేపట్టారు.

జయలలిత కేబెనెట్‌లో ఆయన రహదారులు, ఓడరేవుల మంత్రిగా పని చేశారు. పార్టీ కంటే చిన్నమ్మ శశికళకే పళనిస్వామి వీరవిధేయుడు. అమ్మ తరువాత అమ్మ చిన్నమ్మ చలవతో ఇప్పడు ముఖ్యమంత్రి పీఠమెక్కారు.

English summary
Edapaddi Palanisami took over as the 13th chief minister of Tamil Nadu on Thursday. He was administered the oath of office by Governor of Tamil Nadu (and Maharashtra) Vidyasagar Rao. The Raj Bhavan which was packed with AIADMK supporters chanting long live Amma and long live Chinamma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X