విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేశ్ రాజ్యాంగేతర శక్తి: బొత్స వ్యాఖ్యలపై ఏపీ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు మండిపాటు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసీపీ అధినేత వైయస్ జగన్‌పై ఆంధ్రప్రదేశ్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ను విమర్శించే అర్హత వైసీపీ నేతలకు లేదన్నారు.

వైసీపీ అధినేత జగన్ సీబీఐ కేసుల్లో ఏ1 గా ఉంటే, తెలుగుదేశం పార్టీ యువేత నారా లోకేశ్ కార్యకర్తల సంక్షేమంలో ఏ1గా ఉన్నారని చెప్పారు. వైయస్ జగన్ అంత అవినీతి పరుడు ఈ ప్రపంచంలోనే లేడని గతంలో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు.

సింగపూర్ ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల్లో లొసుగులు ఉన్నాయని, రాజధాని అమరావతి నిర్మాణంలో రూ. లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మంగళవారం ఆరోపించిన నేపథ్యంలో టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారు.

Tnsf president fires on botsa over comments about nara lokesh

మంగళవారం బొత్స మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, టీడీపీ దోపీడీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. సామాన్యుల నుంచి సేకరించిన వేలాది ఎకరాలను సింగపూర్‌లోని ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయడం వాస్తవం కాదా? అని బొత్స ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న సింగపూర్ ప్రతినిధులు ఇప్పుడు రాజీనామా చేసి ప్రైవేట్ కంపెనీలకు సీఈవోలుగా వెళ్తున్నారన్నారు. నారా లోకేశ్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందేనన్నారు. చంద్రబాబు ఓఎస్డీ సీతేపల్లి అభీష్ట రాజీనామాతో ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్న బొత్స ప్రవర్తన మార్చుకోవాలని ముందు లోకేశ్‌కు చంద్రబాబుకు చెప్పాలన్నారు.

English summary
Tnsf president fires on botsa over comments about nara lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X