అమరావతికి ప్రత్యేక ప్రణాళికలు: ఏరియా ఎక్సెటెన్షన్..కొత్త వంతెనలు: రైతుల ఆందోళనతో...!
ముఖ్యమంత్రి మూడు రాజధానుల ప్రకటన..జీఎన్ రావు కమిటీ నివేదికపై ఆగ్రహంతో ఉన్నఅమరావతి రైతుల విషయంలో ప్రభుత్వం ఆలోచన ప్రారంభించింది. ఇప్పటికే అక్కడ రైతులు..వారిచ్చిన భూములకు విలువ వచ్చేలా తీసుకోవాల్సిన నిర్ణయాల పైన కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా.. రాజధాని ప్రాంతం అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేస్తుంది. అక్కడి ప్రజలు..రైతులు తమ ప్రాంతంలో ఉన్న సచివాలయం తరలిస్తే..తమ భూములకు విలువ ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. సచివాలయం తరలినా రాజధాని రైతులకు న్యాయం జరిగేలా జగన్ సర్కార్ ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించింది. ఇందు కోసం.. రాజధాని రైతులకు న్యాయం చేసే దిశగా జగన్ సర్కార్ సరికొత్త సమాలోచనలు ప్రారంభించింది.

విజయవాడకు అనుసంధానం..
ఇప్పుడు ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతం ఉందో..దాన్ని విజయవాడ కి ఎక్సెటెన్షన్ లాగా అభివృద్ది చేయాలని ఆలోచన అధికారులు ముఖ్యమంత్రి వద్ద ప్రతిపాదించినట్లు సమాచారం. దీని వలన రాజధాని రైతులు భూముల విలువ పడిపోకుండా రైతులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని ప్రాంతం అభివృద్దికి కృష్ణా నది పై కొత్త వంతెనలు నిర్మించిన దాని ద్వారా కనెక్టీవిటి పెంచాలని అలొచన కు సైతం దాదాపు ఆమోద ముద్ర వేసినట్లుగా తెలుస్తోంది. భూములు లేకపోవడం వలనే బెజవాడ ఇప్పటి వరకు అభివృద్ధి చెందలేదని భావవిస్తున్న ప్రభుత్వం..ఇప్పుడు రాజధాని కోసం రైతులు ఇచ్చిన ఈ భూములు ఉపయోగించి అభివృద్ధి కి బాటలు వేయాలని దాదాపు డిసైడ్ అయింది.

రైతులకు ప్రయోజనం కలిగేలా..
విజయవాడ ప్రాంతం పై భారం పడకుండా.. ఎక్సెటేన్షన్ ప్రాంతం అభివృద్ది చెందితే రైతులకు కూడా న్యాయం జరుగుతుందని సీఎం జగన్ భావిస్తున్నారు. దీంతో..పక్కా ప్రణాళికతో ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. బ్లా ప్రింగ్ సిద్దం చేసి..ఈ నెల 27న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీని పైన చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే అంశాన్ని ఆందోళన చేస్తున్న రైతులకు వివరించటం ద్వారా..వారి సైతం సహకరించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే అమరావతిని లెజిస్టేచర్ రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అదే సమయంలో ఇక్కడ అభివృద్ది పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయటంతో పాటుగా ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించి..ఆయన పర్యవేక్షణలో ప్రణాళిక త్వరితగతిన అమలయ్యేలా చూడాలని సీఎం జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఉన్న భనవాలను సైతం వినియోగంలోకి..
తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో నిర్మాణం ప్రారంభించి..దాదాపు 60 శాతం నిర్మాణాలను పూర్తి చేసుకున్న భవానాలను సైతం పూర్తి చేసి వినియోగం లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం అక్కడ నిర్మించిన భవనాలను తొలుత మంత్రులు..ఎమ్మెల్యేల నివాస సముదాయాలను అందుబాటులోకి తీసుకురావాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. అదే విధంగా మౌళిక సదుపాయాలను సైతం పెంచే విధంగా ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. వీటి పైన పూర్తి స్థాయి ప్రతిపాదనల మీద అధికారులు కసరత్తు చేస్తున్నారు. పూర్తి ప్రణాళిక సిద్దం అయిన తరువాత..దానినే రాజధాని రైతులకు వివరించి..భవిష్యత్ లో జరిగే మేలును వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా గత ప్రభుత్వం భూ సమీకరణ సమయంలో రైతులతో చేసుకున్న ఒప్పందాలను సైతం యధావిధిగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications