దారుణం: కాపురానికి అడ్డొస్తోందని చిన్నారి హత్య

To stay close to wife, man kills infant
ప్రకాశం: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఒంగోలులో అదృశ్యమైన ఏడాదిన్నర వయస్సున్న అరాధ్య అనే చిన్నారి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు చిన్నారికి బాబాయ్ కావడం గమనార్హం.

తన భార్యతో సన్నిహితంగా గడపడానికి చిన్నారి అడ్డుగా ఉందనే కారణంతో అతడు అభంశుభం తెలియని చిన్నారి ప్రాణాలు బలిగొన్నాడు. వివరాల్లోకి వెళితే.. ఒంగోలులోని రాజాపానగర్ రోడ్డులో ఉన్న శ్రీధర్, సాహితీ దంపతులు తమ బిడ్డ ఆరాధ్య మంగళవారం నుంచి కనిపించకపోవడంతో ఎవరో కిడ్నాప్ చేసి వుంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చిన్నారి బాబాయ్ లక్ష్మీనారాయణే చిన్నారిని హత్య చేశాడని తేల్చారు. ఆరాధ్య పిన్ని సింధూతో లక్ష్మీనారాయణకు మూడు నెలల క్రితం వివాహమైంది. కాగా, ఆరాధ్య ఎక్కువగా పిన్ని దగ్గరే ఉంటోంది. దీంతో తాను తన భార్యతో సన్నిహితంగా గడపడానికి అవకాశం ఉండట్లేదనే కోపంతో ఆరాధ్యను లక్ష్మీనారాయణ చంపేసినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

మంగళవారం ఉదయం ఇంటి బయట ఆడుకుంటున్న ఆరాధ్యను బైకుపై ఊరి బయట పొలాల్లోకి తీసుకెళ్లి గొంతునులిమి చంపేశాడు లక్ష్మీనారాయణ. తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంగళవారం అర్ధరాత్రి చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన ఒంగోలు పోలీసులు, నిందితుడు లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశారు.

తమ కూతురు ఆరాధ్య మృతి చెందిన విషయం తెలిసిన తండ్రి శ్రీధర తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కాగా, తల్లి సాహితీ మాత్రం తన కూతురు మరణించిందంటే నమ్మలేకపోతోంది. తన కూతురు ఆరాధ్య ఊరేళ్లిందని చెబుతున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

అదృశ్యమైన వెంకటకృష్ణ మృతి

విజయవాడ: నగరంలోని భవానీపురంలో మంగళవారం అదృశ్యమైన 14 ఏళ్ల వెంకటకృష్ణ మృతి చెందాడు. కూలింగ్‌ కెనాల్‌లో వెంకటకృష్ణ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. స్నానానికి వెళ్లి వెంకటకృష్ణ మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మంగళవారం సైకిల్‌పై వెళ్లిన వెంకటకృష్ణ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూలింగ్‌ కెనాల్‌ ఒడ్డున సైకిల్‌ లభ్యమవడంతో అక్కడే గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు వెంకటకృష్ణ మృతదేహాన్ని గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+