వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు ఏపీ గవర్నర్ హరి చందన్ జన్మదిన వేడుకలు .. చిన్నారుల మధ్య సెలబ్రేషన్స్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన విశ్వభూషణ్ హరిచందన్ పుట్టిన రోజు నేడు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు 85 వసంతాలు పూర్తి చేసుకుని 86వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోనున్నారు. ఏపీ గవర్నర్ జన్మదిన వేడుకలను రాజ్‌భవన్‌లో గిరిజన, దళిత చిన్నారుల మధ్య జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు హరి చందన్ . ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు .

పోలవరం టెండర్ల రద్దు బాధాకరం .. టెండర్ల రద్దు ఎఫెక్ట్ ప్రాజెక్ట్ నిర్మాణంపై పడుతుందన్న కేంద్రమంత్రిపోలవరం టెండర్ల రద్దు బాధాకరం .. టెండర్ల రద్దు ఎఫెక్ట్ ప్రాజెక్ట్ నిర్మాణంపై పడుతుందన్న కేంద్రమంత్రి

Recommended Video

నేడు ఏపీ గవర్నర్ పుట్టిన రోజు

ఉదయం ఆయనకు టీటీడీ, కనకదుర్గమ్మ దేవస్థాన పండితులు ఆశీర్వచనం అందించనున్నారు. అనంతరం గవర్నర్ కేక్ కట్‌చేసి చిన్నారులకు కొత్త బట్టలు, పుస్తకాలు పంపిణీ చేస్తారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని పెంపొందించే కూచిపూడి ప్రదర్శనతో సహా పలు కార్యక్రమాలు ఉంటాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనలో ఉండడంతో ప్రభుత్వం తరపున మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు గవర్నర్ జన్మదిన వేడుకల్లో పాల్గొననున్నారు. వారు గవర్నర్ హరి చందన్ కు ఏపీ ప్రభుత్వం తరపున జనండిన శుభాకాంక్షలు తెలుపుతారు . అనంతరం గవర్నర్ పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రా లయోలా యూనివర్సిటీలో రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, మొక్కలు నాటనున్నారు.

Today AP Governor Hari Chandans Birthday Celebrations with children

గవర్నర్ హరి చందన్ పుట్టిన రోజు సందర్భంగా చిన్నారుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు, పలు ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఇక గవర్నర్ పుట్టిన రోజు వేడుకల్లో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణతో పాటు వివిధ పార్టీల నేతలు పాల్గొంటారు.

English summary
Governor Biswabhushan Harichandan will celebrate his 86th birthday on Saturday. He will be completing 85 years. According to Governor's secretary Mukesh Kumar Meena, the Governor will participate in social service activities and cultural programmes as part of the birthday celebrations at the Raj Bhavan. The priests of Tirumala Tirupati Devasthanams (TTD) and Sri Durga Malleswara Swamy Varla Devasthanam will bless the Governor with Vedic hymns.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X