వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో మళ్లీ గాలి జనార్ధన్ రెడ్డి ఎంట్రీ ! ఒకే అన్న జగన్ -నేడు తేల్చనున్న సుప్రీంకోర్టు..

|
Google Oneindia TeluguNews

మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత కనుమరుగైన గాలి జనార్ధన్ రెడ్డి మరోసారి ఏపీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారా ? ఏపీ-కర్నాటక సరిహద్దుల్లో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని సీబీఐ నమోదు చేసిన కేసులు విచారణలో ఉండగానే తిరిగి రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అయితే ఇవాళ సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని తేల్చబోతోంది. ఇప్పటికే సీఎం జగన్ దీనికి అనుమతి ఇచ్చేయడంతో సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారింది.

గాలి జనార్ధన్ రెడ్డి రీ ఎంట్రీ

గాలి జనార్ధన్ రెడ్డి రీ ఎంట్రీ

2004-2009 మధ్య కాలంలో ఏపీలో ఓ వెలుగు వెలిగిన చరిత్ర కర్నాటక బీజేపీ నేత గాలి జనార్ధన్ రెడ్డిది. బళ్లారితో మొదలుపెట్టి ఏపీ-కర్నాటక సరిహద్దుల్లో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ పేరుతో భారీ ఎత్తున మైనింగ్ చేస్తున్నట్లు నమ్మించి, లేని ఖనిజాన్ని ఉన్నట్లుగా చూపించి చిక్కుల్లో పడ్డ గాలి జనార్ధన్ రెడ్డి అనంతరం జడ్జికి లంచం ఇస్తూ దొరికిపోవడంతో సుప్రీంకోర్టులో బెయిల్ కూడా దొరకని పరిస్ధితి ఎదుర్కొన్నారు. చివరకు ఎలాగోలా ఈ వ్యవహారం నుంచి కాస్త బయటపడ్డ గాలి జనార్ధన్ రెడ్డి ఇప్పుడు ఏపీలో తనకు అనుకూలమైన ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఎంట్రీ ఇవ్వలేక పోతున్నారు. కానీ తాజాగా ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ఆయనకు వరంగా మారింది.

 గాలి రీఎంట్రీకి ఒప్పుకున్న జగన్

గాలి రీఎంట్రీకి ఒప్పుకున్న జగన్

గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల నేపథ్యంలో సీబీఐ కేసులు పెట్టింది. వాటిపై ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. అదే సమయంలో 2009లో ఓబుళాపురం మైనింగ్ కంపెనీపై ఏపీలో నిషేధం విధించారు. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన జనార్ధన్ రెడ్డికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అనంతరం ఏపీ ప్రభుత్వం దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే తాజాగా జగన్ సర్కార్ ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది. దీంతో గాలి రీఎంట్రీకి మార్గం సుగమమైంది. అయితే సుప్రీంకోర్టు దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Recommended Video

ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే *Politics | Telugu OneIndia
సుప్రీంకోర్టు నిర్ణయమే కీలకం?

సుప్రీంకోర్టు నిర్ణయమే కీలకం?

గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ తిరిగి ఏపీలో కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు జగన్ సర్కార్ కు అభ్యంతరాలు లేకపోయినా ఇప్పటికే ఆ కంపెనీపై దాఖలైన అక్రమాల కేసుల్ని విచారిస్తున్న సీబీఐ తమ విచారణ ఆపే పరిస్ధితి లేదు. దీంతో ఓవైపు సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కంపెనీకి జగన్ సర్కార్ అనుమతిస్తున్నా, సుప్రీంకోర్టు ఏ చెబుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో ఓఎంసీ పిటిషన్ విచారణకు రానుంది. దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగానే ఓఎంసీ ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలు కలుగుతుంది. దీంతో సుప్రీంకోర్టు నిర్ణయం కోసం గాలి జనార్ధన్ రెడ్డితో పాటు జగన్ కూడా ఎదురుచూస్తున్నారు.

English summary
supreme court will decide gali janardhan reddy's obulapuram mining company's re-entry into ap today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X