వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ తో అలీ భేటీ- కుటుంబంతో కలిసి-కీలక పదవిపై 2 వారాల్లో ప్రకటన- కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన టాలీవుడ్ నటుడు అలీకి అప్పట్లో సీఎం జగన్ కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు గడిచిపోతున్నా ఇప్పటిదాకా అలీకి ఎలాంటి పదవీ లభించలేదు దీంతో జగన్ మాటపై నమ్మకంతో వేచి ఉన్న అలీకి తాజాగా శుభవార్త అందింది.

ఈ ఏడాది ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్ధానాలను వైసీపీ సునాయాసంగా చేజిక్కించుకోనుంది. ఈ నేపథ్యంలో వీటిలో ఓ పదవిని అలీకి కేటాయించాలని సీఎం జగన్ నిర్ణయించివట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా టాలీవుడ్ నటులతో కలిసి సీఎం జగన్ తో సినిమా అంశాలపై చర్చల కోసం వచ్చిన అలీకి ముఖ్యమంత్రి త్వరలో గుడ్ న్యూస్ చెప్తానని చెప్పారు. దీంతో వేచిచూస్తున్న అలీకి ఇవాళ కబురు వచ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో భేటీ తర్వాత బయటికి వచ్చిన అలీ.. కీలక విషయాలను వెల్లడించారు.

tollywood actor ali meet ys jagan, assured for annoucement on nominated post in one week

సీఎం జగన్ తో చర్చలకు తనను ఆహ్వానించారని, అందుకే తాడేపల్లి వచ్చినట్లు టాలీవుడ్ నటుడు అలీ తెలిపారు.
త్వరలో పార్టీ ఆఫీసు నుండి ప్రకటన ఉంటుందని సీఎం జగన్ చెప్పినట్లు అలీ చెప్పారు. ఏ పదవి ఇస్తారో తెలియదన్నారు. పదవుల కోసం తాను రాలేదన్నారు. పార్టీ కోసం పని చేశానని అలీ వెల్లడించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తనకు పాత పరిచయం ఉందన్నారు. రెండు వారాల్లో ప్రకటన ఉంటుందని మాత్రమే చెప్పారని అలీ వెల్లడించారు.

తమ పెళ్లి రోజున రావాలనుకున్నా కుదరలేదని, గత ఎన్నికల్లో టికెట్ ఇస్తామన్నారని అలీ తెలిపారు. టైం తక్కువ ఉండటంతో వద్దని చెప్పారన్నారు. ఎమ్మెల్యే అంటే గ్రౌండ్ నుండి వర్క్ చెయ్యాలని, ఫేస్ వ్యాల్యూ బట్టి గెలుపురాదన్నారు.
ఈరోజు పూర్తిగా వ్యక్తిగత భేటీ జరిగిందన్నారు. మరోవైపు సినీ ప్రముఖులని అవమాన పరచాల్సిన అవసరం జగన్ కి ఏముందని అలీ ప్రశ్నించారు. సినీ ప్రముఖులకు ఇవ్వాల్సిన గౌరవం సీఎం జగన్ ఇస్తున్నారన్నారు. గౌరవం ఇవ్వలేదని కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. చిన్న పెద్ద సినిమాలకు ఇబ్బంది లేకుండా.. ప్రజలకు ఇబ్బంది లేకుండా సీఎం నిర్ణయం తీసుకుంటారని టికెట్ ధరలపై వివరించారు. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన అలీ.. అప్పటి నుంచి ఏ ఎన్నికలు వచ్చినా వైసీపీ తరఫున ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో తనకు సన్నిహితంగా ఉన్న నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా ఆయన దూరమయ్యారు.

English summary
tollywood actor ali on today meet cm ys jagan in cm camp office with his family amid rumours on allocation of nomiated post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X