అంతా తప్పుడు ప్రచారం-బెయిల్, పరారీపై మోహన్ బాబు క్లారిటీ..!

కుటుంబ వివాదం నేపథ్యంలో తన ఇంట్లోకి కవరేజ్ కోసం వచ్చిన జర్నలిస్టుపై దాడి చేసిన ఘటనలో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు కోసం పోలీసులు గాలిస్తున్నట్లు నిన్న ప్రచారం జరిగింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ పై తక్షణ ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటిపై మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మోహన్ బాబు ఖండించారు.

జర్నలిస్టు రంజిత్ పై దాడి విషయంలో పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టు కాకుండా మోహన్ బాబు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ కోరారు. అయితే పోలీసులు ఈ కేసులో తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని, ఫిర్యాదు దారు అయిన జర్నలిస్టు రంజిత్ కు ఇప్పటికే సర్జరీ కూడా జరిగిందని, ఇంకా ఆయన ఆస్పత్రిలోనే ఉన్నాడని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో కోర్టు మోహన్ బాబుకు అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. అయితే దీనిపై జర్నలిస్ట్ రంజిత్ కు నోటీసులు ఇచ్చింది. ఆయన నుంచి వివరణ వచ్చాక మోహన్ బాబు కు బెయిల్ పై నిర్ణయం తీసుకోనుంది.

Tollywood actor mohan babu clarified to bail reject rumours says under medical care

అయితే హైకోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని చెప్పేయడంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. దీంతో మోహన్ బాబు పరారీలో ఉన్నారన్న ప్రచారం మొదలైంది. దీనిపై ఆయన ఇవాళ వివరణ ఇచ్చారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఇవాళ ఎక్స్ లో ట్వీట్ పెట్టారు. ముందస్తు బెయిల్ తిరస్కరించబడలేదని, ప్రస్తుతం తాను ఇంట్లో వైద్య సంరక్షణలో ఉన్నానని తెలిపారు. వాస్తవాలను బయటపెట్టాలని మీడియాను ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+