వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన గెలిచే సీట్లివే ? నాగబాబు జోస్యం..!
ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు పక్కాగా సిద్ధమవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలతో ఇక్కడి పార్టీలు వ్యూహాలు మార్చుకుంటున్నాయి. అదే సమయంలో గెలిచే సీట్లపై పలు సర్వేలు కూడా చేయించుకుంటున్నాయి. దీన్ని బట్టి అభ్యర్ధుల్నీ మార్చేస్తున్నాయి. అధికార వైసీపీతో పాటు విపక్ష టీడీపీ-జనసేన కూడా అభ్యర్ధుల ఎంపికతో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలవబోయే సీట్లపై అంచనాలు వేసుకుంటున్నారు.
ఇవాళ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ నేతల భేటీలో పాల్గొన్న ప్రధాన కార్యదర్శి నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఖరారైన నేపథ్యంలో ఇరు పార్టీలు కలిసి ఎన్ని సీట్లు గెలవబోతున్నాయనే అంశంపై తన అంచనాల్ని వెల్లడించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఆ పార్టీకి పాతిక సీట్లకు మించి రావని చెప్పారు. 150 సీట్లతో జనసేన- తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుందన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ హవా తప్పదని పలు సర్వేలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి గట్టి పోటీ ఇచ్చే దిశగా టీడీపీ-జనసేన అభ్యర్ధుల్ని ఎంపిక చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా నాగబాబు ఉమ్మడి నెల్లూరు జిల్లా పర్యటన మొదలుపెట్టారు. సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల ముఖ్యనేతలు, జనసైనికులు, వీరమహిళలతో ఇవాళ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అహంకారంతో విర్రవీగుతున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతోకొంత అభివృద్ధి చేసిన కేసీఆర్ నే ప్రజలు తిరస్కరించారని, అసలు ఏ అభివృద్ధీ చేయని వైసీపీని తుక్కు తుక్కుగా ఓడిస్తారన్నారు. వైనాట్ 175 అంటున్న వైసీపీ పార్టీకి 25 సీట్లు వస్తే గొప్పే అన్నారు.

2019 సార్వత్రిక ఎన్నిల్లో జనసేన పార్టీకి 7 శాతం ఓటింగ్ వచ్చిందని, వైసీపీ నాయకులు ఈ మధ్య టీవీ చర్చల్లో మాట్లాడుతూ జనసేన బలం 12 శాతం వరకు ఉండొచ్చని మాట్లాడారన్నారు. వాళ్లందరికీ తాము ఒకటే చెబుతున్నామని, జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ నాయకత్వం మీద ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జనసేనకు 32 నుంచి 35 శాతం వరకు ఓటు శాతం పెరిగిందని, గోదావరి జిల్లాల్లో అయితే 40 శాతం కంటే ఎక్కువగా ఉందన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల వైసీపీ ఘన విజయం సాధించిందని, వచ్చే ఎన్నికల్లో మాత్రం ప్రతి నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉంటుందన్నారు. జనసేన- టీడీపీ ప్రభుత్వం ఖాయమన్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications